తెలంగాణాలో తప్పనిసరి వంటకాలు: ఇక పండగైనా, పబ్బమైనా, చుట్టాలొచ్చినా, రాకున్నా ఈ వంటకాలు తప్పనిసరిగా చేసుకోవాల్సిందే. 1. సర్వపిండి: కొన్నేళ్ల క్రితం ఇప్పట్లా టిఫిన్లు అవీ ఎక్కువ ఉండేవి కాదు. బయట కొనడానికి కూడా ఏమీ దొరికేవి కావు. ఎప్పుడైనా ఆకలేస్తే. పిల్లలు స్కూలు నుండి రాగానే తినడానికి చాలా తొందరగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకునే ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకం ఇది. దీనికి నూనె ఎక్కువ పట్టదు. బియ్యంపిండితో చేస్తాం కాబట్టి అరగదు అన్న సమస్యే లేదు. దీనినే గిన్నెప్ప లేదా గిన్నెరొట్టె అని కూడా అంటారు. 2. సకినాలు: పిండివంటలు చేయాలంటే దానికి తగిన అచ్చులు కావాలంటారు. మురుకుల పీట కాని, గర్జెల పీట, అరిసెల పీట అని ఉండాలి. కాని రెండు మూడు వస్తువులతోపాటు చేత్తో తయారుచేసే సకినాలు కూడా బియ్యంపిండితో చేయడం వల్ల రుచికరంగా వుంటాయి. ఆరోగ్యానికి కూడా ఇవి ఎటువంటి ఇబ్బంది కలగదు. కాని ఒక్క జాగ్రత్త మాత్రం పాటించాలి. బియ్యం నానబెట్టి వడకట్టి తడిగా వున్నప్పుడే పొడి చేసుకుని తడుపుకోవాలి. చేతివేళ్ల మధ్య పిండిని తీసుకుని చుట్టలుగా తిప్పాలి. అరచేయి మందాన చేసుకోవాలి. ఇవి చేసుకుని తడిబట్టమీద ఆరబెట్టుకుని తర్వాత నూనె వేడి పోసి వేయించుకోవాలి. ఇవి నూనె కూడా ఎక్కువ పీల్చుకోవు. ఈ సకినాలు ఉప్పు అందులో నువ్వులు, జీలకర్రతోనే కాక పచ్చికారం, ఎండుకారం పొడి వేసి కూడా చేస్తారు. సారె వంటకాలలో ఈ సకినాలు తప్పకుండా వుండాల్సిందే. 3. రైల్ పలారం: రైలు ప్రయాణం ఉంది అంటే మధ్య మధ్యలో ఆకలేస్తే తినడానికని ఎన్నో వంటకాలు చేసి డబ్బాల్లో కట్టుకుని తీసుకెళ్తాం. అలాటిదే మన తెలంగాణ స్పెషల్ రైల్ పలారం. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా వ్యవసాయం కాబట్టి వరిపంట విరివిగా వేసేవారు. ఇంట్లో ఎప్పుడూ వరిబియ్యం ఉండేవి. ఆ బియ్యం ఆడించి పిండితో ఎన్నో రకాల ఫలహారాలు చేసుకునేవారు. ఇది కూడా బియ్యంపిండితో చేసే పలారమే. చిన్నా, పెద్దా అందరూ ఇష్టపడే ఘాటైన, రుచికరమైన ఆహారం. చేయడం కాస్త శ్రమ అయినా కుటుంబ సభ్యులందరికీ సరిపడే విధంగా చేసుకుని జాగ్రత్తగా కట్టుకుని తీసుకెళ్తారు. ఇది మరునాటికి కూడా చాలా బావుంటుంది. 4. చికెన్, శనగపప్పు: తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మసాలాలు వాడకుండా మాంసాహారం చాలా రుచిగా వండుతారు. చికెన్ లేదా మటన్ కూరగాయలు, పప్పులు కూడా కలిపి ఎన్నో రకాలుగా చేస్తారు. అందులో ముఖ్యమైనది ఈ చికెన్, శనగపప్పు కూర. అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, ధనియాలపొడి, గరం మసాలాతో చేసే ఈ కూర అద్భుతంగా ఉంటుంది. అన్నం, రొట్టెలకు కూడా బావుంటుంది. 5. బగారన్నం: ఇంట్లో దావత్ ఉంది. మామూలు అన్నం చేస్తే ఎలా? మటన్, చికెన్ చేసినా, కూరగాయలు మాత్రమే చేసినా బగారన్నం తప్పకుండా ఉండాల్సిందే. తెలంగాణ ప్రాంతంలో అన్నిచోట్లా బగారన్నం తప్పనిసరిగా చేస్తారు. దీనికోసం బాస్మతీలాంటి బియ్యం కూడా అక్కరలేదు. కాస్త సన్నవి, పాత బియ్యంతో చేస్తే పొడిపొడిగా రుచిగా కూడా ఉంటుంది. 6. పచ్చిపులుసు: తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా వేడి ప్రదేశాలే. ఈ వేడిని తగ్గించడానికి ఎక్కువగా చింతపండు వాడతారు. పేదవారైనా, గొప్పవారైనా పచ్చిపులుసు చేసుకుంటారు. ఏ కూరగాయ లేకున్నా పచ్చిపులుసు, కాస్త తొక్కు లేదా పెరుగు వేసుకుని నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. ఇది పచ్చిగానే ఉంటుంది, మరిగించరు. ఇష్టమున్నవాళ్లు ఈ పచ్చిపులుసును నీళ్లలా తాగేస్తారు. మాంసాహార వంటకాలు: ఒకప్పుడు మన ఇంటికి చుట్టాలొచ్చారా కోళ్లకు గింజలేయమనే దగ్గర్నుంచి, ఇప్పుడు బయటకెళ్లి బిర్యాని పార్సెల్ తెచ్చుకునేంత వరకూ కాలంలో గాని, మనుషులలో గాని చాలా మార్పు వచ్చింది. అయినా కానీ మాంసాహార వంటకాలపై మక్కువ మాత్రం తెలుగు వారికి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటోంది. కుర్చీలకు అతుక్కునే ఉద్యోగాల వల్ల, శారీరక శ్రమ పెద్దగా ఉండని జీవనంవల్ల కొవ్వూ, కొలెస్ట్రాల్ పెరుగుతుందేమో అనే కొన్ని భయాలు హైకాలరీ ఫుడ్కి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ నిజానికి అనారోగ్యానికి కారణం అదనంగా వాడే మసాలాలు, నూనెలే తిని ఇవి ఎంతో మేలు చేస్తాయి. విజ్ఞానశాస్త్రం చెపుతోంది. ఏదేమన్నా నీసు అంటూ దూరంగా పెడుతున్నది కొంత శాతమే! ఆహారంలో ప్రధాన భాగంగానే కాకుండా రుచికరమైన వంటకాలుగా ఎక్కువ శాతంలో ఉండేది మాత్రం మాంసాహారమే. అంతేకాదు చాలామందికి ఇష్టమైన వంటకాల రకాలలో తప్పకుండా ఒక్క రకమైనా మాంసాహార పదార్థం ఖచ్ఛితంగా ఉండి తీరాల్సిందే అని సర్వేలు చెపుతున్నాయి. అస్సలు మనిషి ఆహార సేకరణ మాంసంతోనే ప్రారంభం అయ్యి ఉంటుంది. అందుకే బోల్డంత పరిణామం జరిగిన తర్వాత కూడా ఆధారాలుగా అచ్చంగా సమతలంగా ఉండేలాంటి శాకాహారుల సమదంతి దంతవిన్యాసం (homodont) లాగా లేదు. అందుకు భిన్నంగా కుంతకాలనబడే కొరికే పళ్లు, రదనికలనే చీల్చే పళ్లతో మానవునిలో విషమదంతి దంతవిన్యాసం (Heterodont) కనిపిస్తుంది. ఇవి మనిషి ఆహారపు అలవాట్లలో ప్రాథమికంగా మాంసాహారులనేందుకు ఆధారంగా నిలుస్తున్నాయి. అంతేకాదు జీర్ణవ్యవస్థలోనూ మాంసాహారాన్ని అరిగించుకునే ప్రత్యేక జీర్ణగ్రంధులుండటం దీనినే నిరూపిస్తోంది. మానవ శరీరంలో తయారుకాని ఆవశ్యకమైన మొత్తం 8 ఆమినో ఆసిడ్లు మాంసాహారంలో ఉన్నాయి. ఇంకా మాంసాహారంలో ఐరన్, విటమిన్ బి1 మరియు నియాసిన్ కూడా పుష్కలంగా ఉంటాయి. 7 తెలంగాణ రుచుల
పుట:తెలంగాణ రుచులు.pdf/28
స్వరూపం