రొయ్యలు, ఉల్లిపొరక కూర - 5 కావలసిన పదార్థాలు రొయ్యలు 250గ్రా.లు అల్లం, వెల్లుల్లి ముద్ద ఉల్లిపొరక తరుగు 2 కప్పులు / 250 పసుపు 2 టీ స్పూన్స్ 1/2 టీ స్పూన్ కారంపొడి గ్రా.లు 2 టీ స్పూన్స్ ఉల్లిపాయ 1 ధనియాల పొడి 2 టీ స్పూన్స్ పచ్చిమిర్చి 2 గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్ 2 రెబ్బలు ఉప్పు తగినంత 4 టేబుల్ స్పూన్స్ కరివేపాకు నూనె తయారుచేసే విధానం ఉల్లిపొరక శుభ్రం చేసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేగిన తర్వాత రొయ్యలు వేసి కలపాలి. తర్వాత కారంపొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి. రొయ్యలు బాగా వేగిన తర్వాత కొన్ని నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. రొయ్యలు ఉడికిన తర్వాత ఉల్లిపొరక, గరంమసాలా పొడి వేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. కూరంతా ఉడికి, దగ్గిర పడ్డాక దింపేయాలి. రొయ్యలు, టమాటాలు - 6 కావలసిన పదార్థాలు రొయ్యలు టమాటాలు 250గ్రా.లు ధనియాల పొడి 2 టీ స్పూన్స్ 3 గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్ ఉల్లిపాయలు 2 పసుపు 1/4 టీ స్పూన్ పచ్చిమిర్చి 2 కారంపొడి 1/2 టీ స్పూన్స్ కరివేపాకు 2 రెబ్బలు ఉప్పు తగినంత అల్లం, వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్స్ నూనె 4 టేబుల్ స్పూన్స్ తయారుచేసే విధానం రొయ్యలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేగిన తర్వాత కారంపొడి, ధనియాల పొడి వేసి కలపాలి. ఇందులో రొయ్యలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. రొయ్యలు బాగా మగ్గిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి కలిపి మూతపెట్టాలి. టమాటా ముక్కలు మెత్తబడ్డ తర్వాత అరకప్పు నీళ్లు పోసి దగ్గర పడేవరకు ఉడికించి గరం మసాలాపొడి వేసి కలిపి దింపేయాలి. తెలంగాణ 257 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/278
స్వరూపం