Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలంగాణ రొయ్యలు ఎండుమిర్చి కరివేపాకు పసుపు ధనియాలు తయారుచేసే విధానం I రొయ్యల వేపుడు - 3 500 గ్రా.లు కావలసిన పదార్థాలు జీలకర్ర మిరియాలు 6 2 రెబ్బలు అల్లం, వెల్లుల్లి ముద్ద 1/2 టీ స్పూన్ ఉప్పు 2 టీ స్పూన్స్ నూనె 1 టీ స్పూన్ 1 టీ స్పూన్ 1/2 టీ స్పూన్స్ తగినంత 4 టేబుల్ స్పూన్స్ రొయ్యలు శుభ్రంగా కడిగి తగినంత ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఉడికించాలి. ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, మిరియాలు కొద్దిగా వేయించి బరకగా పొడి చేసుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి కొద్దిగా వేపాలి. ఇందులో ఉడికించిన రొయ్యలు వేసి దోరగా వేయించాలి. తడి ఆరిపోయిన తర్వాత కారం మసాలా పొడి, కరివేపాకు వేసి, ఉప్పు సరిచూసుకుని కలుపుతూ వేయించాలి. రొయ్యలు ఎర్రగా వేయించి దింపేయాలి. రొయ్యలు, మునగకాయ కూర - 4 కావలసిన పదార్థాలు రొయ్యలు మునగకాయలు 500 గ్రా.లు పసుపు 1/2 టీ స్పూన్ 4 కారంపొడి 2 టీ స్పూన్స్ ఉల్లిపాయలు 2 ధనియాల పొడి 2 టీ స్పూన్స్ పచ్చిమిర్చి 2 గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్ టమాటాలు 2 ఉప్పు తగినంత కరివేపాకు 2 రెబ్బలు నూనె 4 టేబుల్ స్పూన్స్ 2 టీ స్పూన్స్ అల్లం, వెల్లుల్లి ముద్ద తయారుచేసే విధానం మునగకాయలు ముక్కలుగా తరిగి పైన పొట్టు తీసేయాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తర్వాత కారంపొడి, ధనియాల పొడి వేసి కలపాలి. ఇందులో రొయ్యలు, తగినంత ఉప్పు వేసి బాగా వేగిన తర్వాత నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. రొయ్యలు ఉడికిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు, మునగకాయలు వేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. టమాటా ముక్కలు మగ్గి, మునగకాయలు ఉడికి దగ్గరగా అయ్యాక గరంమసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. 256