తెలంగాణ బొమ్మిడి చేపలు, చింతకాయ - 11 బొమ్మిడి చేపలు లేత చింతకాయలు ఉల్లిపాయలు కావలసిన పదార్థాలు 3 250గ్రా.లు 2 తయారుచేసే విధానం పచ్చిమిర్చి కరివేపాకు పసుపు అల్లం, వెల్లుల్లి ముద్ద కారంపొడి ధనియాల పొడి గరం మసాలా పొడి ఉప్పు నూనె 2 రెబ్బలు 1/2 టీ స్పూన్ - 2 టీ స్పూన్స్ 2 టీ స్పూన్స్ 2 టీ స్పూన్స్ 1/4 టీ స్పూన్ తగినంత 4 టేబుల్ స్పూన్స్ బొమ్మిడి చేపలు చివర్లు తీసేసి ముక్కలుగా చేసుకోవాలి. కడాయిలో చెంచాడు నూనె వేసి ఈ ముక్కలను దోరగా వేయించి పెట్టుకోవాలి. లేత చింతకాయలను కడిగి, తుడిచి మెత్తగా రుబ్బుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేగిన తర్వాత కారంపొడి, ధనియాల పొడి వేసి కలపాలి. తర్వాత చేపముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. ముక్కలు కాస్త వేగిన తర్వాత చింతకాయ ముద్ద, కప్పు నీళ్లు పోసి కలిపి మూతపెట్టాలి. చిక్కబడిన తర్వాత గరం మసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. చింతకాయ గుజ్జు బదులు చింతకాయ పులుసు కూడా వేసుకోవచ్చు. 254
పుట:తెలంగాణ రుచులు.pdf/275
స్వరూపం