తెలంగాణ రుచుల 8. కాళ్లు కాళ్ల కూర కావలసిన పదార్థాలు మేక కాళ్లు పసుపు ఉల్లిపాయ 6-8 షాజీర 1/4 టీ స్పూన్ పుదీనా ఆకులు 1 టీస్పూన్ 1/2 కప్పు 1 కారంపొడి లవంగాలు ఇలా 1 టీ స్పూన్ అల్లం, వెల్లుల్లి ముద్ద పచ్చిమిర్చి 1 టీ స్పూన్ 5 నూనె 2 టీ స్పూన్స్ 3 ఉపు తగినంత దాల్చిన చెక్క చిన్న ముక్క తయారుచేసే విధానం మేక కాళ్లు కాల్చి, కడిగి నాలుగు ముక్కలుగా చేసుకోవాలి. గిన్నెలో ఈ కాళ్లు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, పుదీనా ఆకులు, పసుపు, కారంపొడి, గరంమసాలా, అల్లం, వెల్లుల్లి ముద్ద, నూనె, తగినంత ఉప్పు, 6-8 గ్లాసులు నీళ్లు పోసి నిదానంగా రెండు గంటలు ఉడికించాలి. లేదా కుక్కర్లో పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత చిక్కబడేవరకు ఉడికించుకుని దింపేయాలి. పలుచగా కావాలంటే అలాగే జొన్న లేదా గోధుమ రొట్టెలతో తినొచ్చు. కాళ్ల పులుసు కావలసిన పదార్థాలు మేక కాళ్లు ఉల్లిపాయలు 6-8 కారంపొడి 2 పచ్చిమిర్చి 3 ధనియాల పొడి గరం మసాలా పొడి అల్లం, వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్స్ ఉప్పు కరివేపాకు పసుపు 2 రెబ్బలు 1/2 టీ స్పూన్ చింతపండు పులుసు నూనె తయారుచేసే విధానం 2 టీ స్పూన్స్ 2 టీ స్పూన్స్ 1/4 టీ స్పూన్ తగినంత 1/4 కప్పు 3 టేబుల్ స్పూన్స్ మేక కాళ్లు కాల్చి, కడిగి నాలుగు ముక్కలుగా చేసుకోవాలి. ఒక గిన్నెలో కాళ్లు, సగం పసుపు, సగం అల్లం వెల్లుల్లి ముద్ద, తగినంత ఉప్పు, 6 గ్లాసుల నీళ్లు పోసి నిదానంగా ఉడికించుకోవాలి. కుక్కర్లో ఉడికిస్తే తొందరగా అవుతుంది. మరో గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేగిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి వేసి కలపాలి. రెండునిమిషాల తర్వాత ఉడికించిన కాళ్లు నీళ్లతో సహా ఇందులో వేసి ఉప్పు సరిచూసుకుని ఉడికించాలి. కాస్త చిక్కబడ్డాక చింతపండు పులుసు వేసి మరో అయిదు నిమిషాలు ఉడికించి గరం మసాలా పొడి వేసి దింపేయాలి. ఇందులో తలకాయ కూర కూడా కలిపి చేసుకోవచ్చు. 248
పుట:తెలంగాణ రుచులు.pdf/269
స్వరూపం