తెలంగాణ రుచ జబాన్ / నాలుక జన్ కూర కావలసిన పదార్థాలు ధనియాల పొడి గరం మసాలా పొడి చింతపండు పులుసు కొబ్బరి పొడి 2 టీ స్పూన్స్ 1/2 టీ స్పూన్ 1/4 కప్పు 2 టీ స్పూన్స్ ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి 3 కరివేపాకు 2 రెబ్బలు అల్లం, వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్స్ ఉప్పు పసుపు 1/2 టీ స్పూన్ నూనె కారంపొడి 2 టీ స్పూన్స్ తయారుచేసే విధానం తగినంత 4 టేబుల్ స్పూన్స్ తర్వాత జబాన్ నాలుక / జబాన్ శుభ్రంగా కడిగి ముక్కలుగా తరగాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద సి కొద్దిగా వేగిన తర్వాత ముక్కలువేసి కలిపి మూత పెట్టాలి. కాస్త మగ్గిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి వేయించాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. జబాన్ ముక్కలు ఉడికిన తర్వాత కొబ్బరిపొడి, చింతపండు పులుసు వేసి చిక్కబడేవరకు ఉడికించి గరం మసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. సిర్ దాన్ కూర కావలసిన పదార్థాలు N ఉల్లిపాయలు 3 ధనియాల పొడి గరం మసాలా పొడి 2 టీ స్పూన్స్ 1/2 టీ స్పూన్ అల్లం, వెల్లుల్లి ముద్ద కరివేపాకు 2 టీ స్పూన్స్ 2 రెబ్బలు కొబ్బరి పొడి 3 టీ స్పూన్స్ ఉప్పు తగినంత పసుపు 1/2 టీ స్పూన్ నూనె 4 టేబుల్ స్పూన్స్ కారంపొడి 2 టీ స్పూన్స్ తయారుచేసే విధానం గిన్నెలో నీళ్లు మరిగించి సిరాన్లు వేయాలి. పదినిమిషాలు ఉంచి తీసి వేడిమీదనే చాకుతో లేదా చెంచాతో పైన అంతా గీకేయాలి. ఇలా చేసుకున్న తర్వాత బాగా కడిగి ముక్కలుగా తరగాలి. వీటికి కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పది నిమిషాలు ఉడికించాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేగిన తర్వాత సిర్దాన్ ముక్కలు వేసి కలిపి మూతపెట్టాలి. కాస్త మగ్గిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు, కొబ్బరిపొడి వేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. ముక్కలు మసాలాలో బాగా ఉడికి నీరంతా ఇగిరిపోయాక గరం మసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. 246
పుట:తెలంగాణ రుచులు.pdf/267
స్వరూపం