బోటి పప్పు - 9 కావలసిన పదార్థాలు గరం మసాలా పొడి 500 గ్రా. ధనియాల పొడి కందిపప్పు 200 గ్రా. ఉల్లిపాయలు 2 అల్లం, వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్స్ చింతపండు పులుసు కరివేపాకు పసుపు 1/2 టీ స్పూన్ ఉప్పు కారంపొడి 2 టీ స్పూన్స్ నూనె తయారుచేసే విధానం 2 టీ స్పూన్స్ 1/2 టీ స్పూన్ 1/4 కప్పు/50 మి.లీ. 2 రెబ్బలు తగినంత 4 టేబుల్ స్పూన్స్ బోటి కడిగి, కొంచెం పసుపు, సగం అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. కందిపప్పు కడిగి తగినన్ని నీళ్లు పోసి, కొంచెం పసుపు, అరచెంచా నూనె వేసి మెత్తగా ఉడికించుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేగిన తర్వాత ఉడికించిన బోటి, కారంపొడి, ధనియాల పొడి కలిపి మూతపెట్టి ఉడికించాలి. నీరంతా ఇగిరిపోయిన తర్వాత చింతపండు పులుసు వేసి మరికొద్దిసేపు ఉడికించాలి. తర్వాత ఉడికిన కందిపప్పు మెదిపి ఇందులో వేయాలి. తగినంత ఉప్పు, గరంమసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. ఉల్లిపాయ | బోటి దప్పడం / చారు - 9 250 గ్రా. 1 3 పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర 2 రెబ్బలు కొద్దిగా 2 టమాటాలు బెండకాయలు 100 గ్రా.లు మునగకాయలు 3 అల్లం, వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్ కావలసిన పదార్థాలు పసుపు కారంపొడి ధనియాల పొడి గరం మసాలా పొడి బియ్యంపిండి ఉప్పు 1/2 టీ స్పూన్ 1 టీ స్పూన్స్ 1 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ 3 టేబుల్ స్పూన్స్ తగినంత నూనె 3 టేబుల్ స్పూన్స్ చింతపండు పులుసు 2 కప్పులు తెలంగాణ రుచుల తయారుచేసే విధానం బోటి కడిగి, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు వేసి ఉడికించు కోవాలి. ఒక గిన్నెలో చింతపండు పులుసు పలుచగా చేసుకొని, తరిగిన ఉల్లిపాయ, టమాటాలు, కాస్త పెద్ద ముక్కలుగా తరిగిన బెండకాయలు, చెక్కు తీసి తరిగిన మునగకాయలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారంపొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి చిన్న మంటమీద మరిగించాలి. ముక్కలు ఉడికిన తర్వాత బోటి, గరంమసాలా పొడి వేసి కాస్త చిక్కబడేవరకూ మరిగించాలి. బియ్యంపిండిలో కప్పుడు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి మరుగుతున్న చారులో వేసి చిక్కబడగానే దింపేయాలి. 242
పుట:తెలంగాణ రుచులు.pdf/263
స్వరూపం