Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పుంటికూర ఉల్లిపాయలు బోటి, పుంటికూర - 3 కావలసిన పదార్థాలు కరివేపాకు కారంపొడి ధనియాల పొడి 500 గ్రా. 6 కట్టలు 2 3 1/2 టీ స్పూన్ ఉప్పు అల్లం, వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్స్ నూనె పచ్చిమిర్చి పసుపు తయారుచేసే విధానం గరం మసాలా పొడి 2 రెబ్బలు 2 టీ స్పూన్స్ 2 టీ స్పూన్స్ 1/2 టీ స్పూన్ తగినంత 4 టేబుల్ స్పూన్స్ బోటి శుభ్రం చేసుకుని, కరివేపాకు, కారంపొడి, కొంచెం పసుపు, సగం అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఉడికించాలి. పుంటికూర ఆకులు కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. మందంగా ఉన్న గిన్నెలో నూనె వేడిచేయాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన లేదా నూరిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించి, పసుపు, సగం అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేపి తరిగిన పుంటికూర, దానికి తగిన ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి. ఆకు బాగా మగ్గిన తర్వాత ఉడికిన బోటి, ధనియాల పొడి వేసి ఉప్పు సరిచూసుకుని కలిపి మూత పెట్టాలి. మొత్తం కూర ఉడికి దగ్గరపడ్డాక గరంమసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. ఇందులో గోంగూర, పచ్చిమిర్చి కలిపి ఉడికించి, మెత్తగా రుబ్బి కూడా వేసుకోవచ్చు. బోటి, చుక్కకూర - 4 కావలసిన పదార్థాలు 500 గ్రా. కరివేపాకు చుక్కకూర ఉల్లిపాయలు 6 కట్టలు అల్లం, వెల్లుల్లి ముద్ద 2 గరం మసాలా పొడి పసుపు 1/2 టీ స్పూన్ ఉప్పు కారంపొడి 2 టీ స్పూన్స్ నూనె 2 టీ స్పూన్స్ 2 రెబ్బలు 2 టీ స్పూన్స్ 1/2 టీ స్పూన్ తగినంత 4 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి తయారుచేసే విధానం బోటి శుభ్రంగా కడిగి, కాస్త పసుపు, సగం అల్లం వెల్లుల్లి ముద్ద, కారంపొడి, తగినంత ఉప్పు, కరివేపాకు వేసి కలిపి ఉడికించాలి. గిన్నెలో నూనె వేడి చేసి, ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేగిన తర్వాత ఉడికించిన బోటి వేసి కలిపి మూత పెట్టాలి. కొద్దిగా మగ్గిన తర్వాత తరిగిన చుక్కకూర, ధనియాల పొడి వేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. కూర బాగా ఉడికి దగ్గరపడ్డాక గరంమసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. తెలంగాణ 239 రుచులు