Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలంగాణ రుచ 7. బోటి బోటి కూర - 1 కావలసిన పదార్థాలు కారంపొడి ధనియాల పొడి గరం మసాలా పొడి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు 500 గ్రా. 3 3 2 రెబ్బలు అల్లం, వెల్లుల్లి ముద్ద పసుపు 2 టీ స్పూన్స్ ఉప్పు నూనె 1/2 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ 2 టీ స్పూన్స్ 1/2 టీ స్పూన్ తగినంత 4 టేబుల్ స్పూన్స్ తయారుచేసే విధానం బోటి కడిగి కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా నీళ్లు పోసి కుక్కర్లో లేదా గిన్నెలో ఉడికించాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, ధనియాల పొడి వేసి వేపాలి. తర్వాత ఉడికించిన బోటి ముక్కలు వేసి ఉప్పు సరిచూసుకుని మూతపెట్టి చిన్న మంట మీద ఉడికించాలి. ముక్కలు ఉడికి దగ్గర పడ్డాక గరంమసాలా పొడి వేసి కలిపి పేయాలి. బోటి, శనగలు - 2 కావలసిన పదార్థాలు 500 గ్రా. ఎర్రశనగలు పసుపు 500 గ్రా. 1/2 టీ స్పూన్ అల్లం, వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్స్ పచ్చిమిర్చి 5 ఉల్లిపా 1 2 రెబ్బలు కరివేపాకు తయారుచేసే విధానం కారంపొడి ధనియాల పొడి గరం మసాలా పొడి ఉప్పు నూనె ఆవాలు, జీలకర్ర 2 టీ స్పూన్స్ 2 టీ స్పూన్స్ 1/2 టీ స్పూన్ తగినంత 4 టేబుల్ స్పూన్స్ 1/2 టీ స్పూన్ ఎర్రశనగలు కడిగి నీళ్లు పోసి కనీసం ఆరు గంటలు లేదా రాత్రంతా నాబెట్టాలి. తెల్లారి నీళ్లన్నీ తీసేసి మళ్లీ కడిగి, తగినన్ని నీళ్లు, కొంచెం పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. శనగలు ఉడికిన తర్వాత జల్లెట్లో వేసుకోవాలి. బోటి శుభ్రం చేసుకుని, కొంచెం పసుపు, కారంపొడి, అర చెంచా అల్లం, వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి ఉడికించుకోవాలి. నీరు పోయకూడదు. కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నూరిన పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేపి పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. ఇందులో శనగలు వేసి బాగా వేపాలి. తర్వాత ఉడికించిన బోటి, ధనియాల పొడి వేసి ఉప్పు సరిచూసుకుని కలుపుతూ తడి ఆరిపోయేవరకూ వేపాలి. చివరగా గరం మసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. 238