Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కార్జం టమాటా కావలసిన పదార్థాలు పసుపు కారంపొడి కార్జం 250గ్రా. టమాటాలు 3 ఉల్లిపాయలు 2 ధనియాల పొడి పచ్చిమిర్చి 2 గరం మసాలా పొడి కరివేపాకు 2 రెబ్బలు ఉప్పు అల్లం, వెల్లుల్లి ముద్ద పాలు 1/2 టీ స్పూన్స్ నూనె 1/4 కప్పు 1/2 టీ స్పూన్ 12 టీ స్పూన్ 1 టీ స్పూన్ 1/4 టీ స్పూన్ తగినంత 3 టేబుల్ స్పూన్స్ తయారుచేసే విధానం కార్జం ముక్కలలో కొద్దిగా పసుపు, పాలు పోసి కలిపి పది నిమిషాల తర్వాత నీళ్లతో బాగా కడిగి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించి, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి కొద్దిగా వేపి కార్జం ముక్కలు, కారం పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలుపుతూ వేయించాలి. తర్వాత తగినన్ని నీళ్లు కలిపి మూతపెట్టి ఉడికించాలి. ముక్కలు ఉడికిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి కలిపి మూతపెట్టాలి. ముక్కలు మగ్గి, చిక్కబడ్డ తర్వాత గరంమసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. కార్జం ఉల్లిపాయలు 250గ్రా. 2 పచ్చిమిర్చి 2 కార్జం మిరియాల వేపుడు కావలసిన పదార్థాలు ధనియాల పొడి గరం మసాలా పొడి మిరియాల పొడి కరివేపాకు 2 రెబ్బలు ఉప్పు అల్లం, వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్స్ నూనె పసుపు టీ 1/2 టీ స్పూన్ పాలు కారంపొడి 1 టీ స్పూన్ 1 టీ స్పూన్ 1/4 టీ స్పూన్ 1/4 టీ స్పూన్ తగినంత 3 టేబుల్ స్పూన్స్ 1/4 కప్పు తయారుచేసే విధానం కార్జంలో కొద్దిగా పసుపు, పాలు పోసి కలిపి పది నిమిషాల తర్వాత నీళ్లతో బాగా కడిగి పెట్టుకోవాలి. మందంగా, వెడల్పుగా ఉండే గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి కొద్దిగా వేపి కార్జం ముక్కలు, కారం పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి. ముక్కలు బాగా వేగిన తర్వాత నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. ముక్కలు ఉడికిన తర్వాత మిరియాలపొడి, గరంమసాలా పొడి వేసి కలిపి దగ్గరగా అయ్యేవరకు వేయించుకొని దింపేయాలి. తెలంగాణ 233 రుచులు