Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మెదడు, మిరియాల పొడి వేపుడు - 3 కావలసిన పదార్థాలు మెదడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి 1 2 తయారుచేసే విధానం కరివేపాకు అల్లం, వెల్లుల్లి ముద్ద పసుపు కారంపొడి మిరియాల పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి ఉప్పు నూనె - 2 రెబ్బలు 1/2 టీ స్పూన్స్ టీ 1/4 టీ స్పూన్ 1 టీ స్పూన్ 1/4 టేబుల్ స్పూన్ 2 టీ స్పూన్స్ 1/4 టీ స్పూన్ తగినంత 4 టేబుల్ స్పూన్స్ మెదడు కడిగి గోరువెచ్చని నీళ్లు పోసి చల్లారిన తర్వాత దారాలు తీసేసి చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా అయ్యేవరకూ వేయించుకుని, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి రెండు నిమిషాలు వేగిన తర్వాత కారంపొడి, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి కలుపుతూ కొద్దిగా వేయించాలి. ఇందులో మెదడు ముక్కలు, తగినంత ఉప్పు వేసి చిన్న మంట మీద కలుపుతూ వేయించాలి. మెదడు ముక్కలు బాగా వేగిన తర్వాత గరంమసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. ఇందులో ఎర్రకారం పొడి బదులు మిరియాల పొడి ఇంకాస్త ఎక్కువగా వేసుకోవాలి. తెలంగాణ 230