Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4. మెదడు మెదడు, మెంతికూర - 1 కావలసిన పదార్థాలు పసుపు కారంపొడి ధనియాల పొడి 1/4 టీ స్పూన్ 12 టీ స్పూన్స్ మెదడు 1 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి 2 కరివేపాకు 2 రెబ్బలు గరం మసాలా పొడి మెంతికూర 2 చిన్న కట్టలు ఉప్పు అల్లం, వెల్లుల్లి ముద్ద 1/2 టీ స్పూన్స్ నూనె తయారుచేసే విధానం 2 టీ స్పూన్స్ 1/4 టీ స్పూన్ తగినంత 4 టేబుల్ స్పూన్స్ మెదడు కడిగి ఒక గిన్నెలో వేసి అది మునిగేలా గోరువెచ్చని నీళ్లు పోయాలి. చల్లారిన తర్వాత మధ్యలో ఉండే దారాలు అవీ తీసి చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, శుభ్రంగా కడిగి తరిగిన మెంతికూర వేసి వేయించాలి. తర్వాత కారంపొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి అరకప్పు నీళ్లు పోసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత మెదడు ముక్కలు వేసి మెల్లిగా కలిపి మూతపెట్టాలి. మొత్తం ఉడికిన తర్వాత గరంమసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. ఈ కూర మెంతికూర లేకుండా కూడా చేసుకోవచ్చు. మెదడు టమాటాలు ఉల్లిపాయల పచ్చిమిర్చి కరివేపాకు అల్లం, వెల్లుల్లి ముద్ద తయారుచేసే విధానం I 1 4 3 2 మెదడు, టమాటా కూర - 2 కావలసిన పదార్థాలు పసుపు కారంపొడి ధనియాల పొడి గరం మసాలా పొడి ఉప్పు 1/2 టీ స్పూన్స్ నూనె 2 రెబ్బలు 1/4 టీ స్పూన్ 12 టీ స్పూన్స్ 2 టీ స్పూన్స్ 1/4 టీ స్పూన్ తగినంత 4 టేబుల్ స్పూన్స్ మెదడు కడిగి గోరువెచ్చని నీళ్లు పోసి చల్లారిన తర్వాత దారాలు అవీ తీసేసి చిన్న ముక్కలు చేసుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు, కారంపొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి. టమాటాలు మగ్గిన తర్వాత బాగా కలిపి మెదడు ముక్కలు వేసి వేపి మెల్లగా కలిపి మూతపెట్టాలి. మరి కొద్దిసేపు ఉడికించి గరంమసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. తెలంగాణ 229 రుచులు