Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కీమా ముట్టీలు, పుంటికూర - 13 250గ్రా. 2 కావలసిన పదార్థాలు కొబ్బరిపొడి ధనియాల పొడి మా పుంటికూర 6, 8 కట్టలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి 4 గరం మసాలా పొడి అల్లం, వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్స్ ఉప్పు 1/2 టీ స్పూన్ నూనె 2 టీ స్పూన్స్ 2 టేబుల్ స్పూన్స్ 2 టీ స్పూన్స్ 1/4 టీ స్పూన్ తగినంత 4 టేబుల్ స్పూన్స్ పసుపు కారంపొడి తయారుచేసే విధానం పుంటికూర ఆకులు కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. కీమాలో సగం పసుపు, కారంపొడి, ధనియాల పొడి, కొబ్బరి పొడి మొత్తం, సగం అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపి దంచుకోవాలి. ఇందులో చెంచాడు నూనె కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకొని కాస్త వెడల్పుగా వత్తుకోవాలి. వెడల్పాటి గిన్నెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కారంపొడి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేపి ముట్టీలు వేసి మూతపెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత రెండోవైపు తిరగేయాలి. ముట్టీలు బాగా వేగిన తర్వాత పుంటికూర, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి. మొత్తం ఉడికి దగ్గరపడ్డాక గరం మసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. తెలంగాణ రుచుల కీమా ముట్టీలు, చామగడ్డ కూర - 14 కావలసిన పదార్థాలు కీమా చామగడ్డలు 250గ్రా. 250గ్రా. టమాటాలు కరివేపాకు 3 కారంపొడి ధనియాల పొడి గరం మసాలా పొడి 2 టీ స్పూన్స్ 2 టీ స్పూన్స్ 1/2 టీ స్పూన్ 2 రెబ్బలు కొబ్బరిపొడి అల్లం, వెల్లుల్లి ముద్ద పసుపు 2 టీ స్పూన్స్ ఉప్పు 1/2 టీ స్పూన్ నూనె తయారుచేసే విధానం 2 టేబుల్ స్పూన్స్ తగినంత 4 టేబుల్ స్పూన్స్ చామగడ్డలు పొట్టు తీసి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. కీమాలో సగం పసుపు, కారంపొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, తగినంత ఉప్పు, కొబ్బరి పొడి మొత్తం వేసి కలిపి దంచుకోవాలి. ఇందులో చెంచాడు నూనె వేసి కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కారంపొడి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేగిన తర్వాత ముట్టీలు వేసి మూతపెట్టి. ఐదు నిమిషాల తర్వాత మెల్లిగా తిరగేయాలి. ముట్టీలు బాగా వేగిన తర్వాత చామగడ్డలు, కారంపొడి, ఉప్పు, ధనియాల పొడి, సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి కలిపి మూతపెట్టి. కొద్దిగా వేగిన తర్వాత కప్పుడు నీళ్లు పోసి ఉడికించాలి. చామగడ్డలు ఉడికి చిక్కబడ్డ తర్వాత గరం మసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. ఇష్టముంటే కాస్త చింతపండు పులుసు కలుపుకోవచ్చు. 228