కీమా ఉల్లిపాయలు కీమా ముట్టీలు, మెంతికూర - 11 250 గ్రా. 3 3 కావలసిన పదార్థాలు కారంపొడి ధనియాల పొడి గరం మసాలా పొడి కొబ్బరిపొడి 2 టీ స్పూన్స్ 2 టీ స్పూన్స్ 1/2 టీ స్పూన్ 3 టేబుల్ స్పూన్స్ తగినంత పచ్చిమిర్చి కరివేపాకు 2 రెబ్బలు అల్లం, వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్స్ ఉప్పు మెంతికూర పసుపు 2 కట్టలు చిన్నవి 1/2 టీ స్పూన్ నూనె 4 టేబుల్ స్పూన్స్ తయారుచేసే విధానం కీమాలో సగం పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, గరంమసాలా పొడి, కొబ్బరిపొడి, ఉప్పు వేసి మెత్తగా దంచుకుని చిన్న చిన్న ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. ఇందులో కడిగి సన్నగా తరిగిన మెంతికూర, మిగిలిన పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారంపొడి వేసి కొద్దిగా వేయించి, తయారు చేసి పెట్టుకున్న ముట్టీలు వేసి మూతపెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత మెల్లిగా తిరగేయాలి. ఇలా ముట్టీలు బాగా వేగిన తర్వాత తగినంత ఉప్పు, గరం మసాలా పొడి, కొబ్బరిపొడి, అరకప్పు నీళ్లు పోసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. నూనె తేలిన తర్వాత దింపేయాలి. కీమా ముట్టీల పప్పు - 12 250గ్రా. 200 గ్రా. కావలసిన పదార్థాలు కరివేపాకు కొత్తిమీర చింతపండు పులుసు కీమా కందిపప్పు ఉల్లిపాయ 1 అల్లం, వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్ ధనియాల పొడి పసుపు 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి కారంపొడి 2 టీ స్పూన్స్ ఉప్పు కొబ్బరిపొడి 3 టీ స్పూన్స్ నూనె తయారుచేసే విధానం 2 రెబ్బలు కొద్దిగా 1/4 కప్పు 2 టీ స్పూన్స్ 1/4 టీ స్పూన్ తగినంత 4 టేబుల్ స్పూన్స్ కందిపప్పు కడిగి కాస్త పసుపు, కాస్త నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. కీమాలో సగం పసుపు, కారంపొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, కొబ్బరి పొడి, తగినంత ఉప్పు వేసి, కలిపి దంచుకుని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. కడాయిలో రెండు చెంచాల నూనె వేడి చేసి ఈ ఉండలు ఎర్రగా వేయించి పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో మిగిలిన నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించి, పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేపి, కారంపొడి, ధనియాల పొడి వేసి కలపాలి. ఇందులో వేయించిన ముట్టీలు వేసి కలిపి, చింతపండు పులుసు, ఉడికించిన కందిపప్పు వేసి కలిపి ఉప్పు సరిచూసుకుని మొత్తం కలిపి మరో ఐదు నిమిషాలు ఉడికించి గరం మసాలా పొడి, కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి. తెలంగాణ 227 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/248
స్వరూపం