కీమా 500 UP. అల్లం, వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్స్ పసుపు 1/2 టీ స్పూన్ పుట్నాల పొడి కీమా ముట్టీలు వేపుడు - 9 కావలసిన పదార్థాలు గరం మసాలా పొడి మిరియాల పొడి 1/4 టీ స్పూన్ 1/4 టీ స్పూన్ టీ 3 టేబుల్ స్పూన్స్ కారంపొడి 2 టీ స్పూన్స్ ఉప్పు తగినంత ధనియాల పొడి 2 టీ స్పూన్స్ నూనె 5 టేబుల్ స్పూన్స్ తయారుచేసే విధానం కీమా కడిగి నీరంతా పిండేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులో పసుపు, కారంపొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, ధనియాలపొడి, పుట్నాల పొడి, గరం మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి రోట్లో వేసి అంతా కలిసేలా దంచుకోవాలి. లేదా మిక్సీలో కొద్దిగా తిప్పితే సరి. ఈ కీమా ముద్దలో చెంచాడు నూనె వేసి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వెడల్పాటి కడాయిలో నూనె వేడి చేసి ఈ ముట్టీలను వేసి ఎర్రగా అయ్యేవరకు వేయించుకోవాలి. ఈ ముట్టీలు పెద్దగా చేయకుండా, కాస్త చిన్నగా చేసుకుని, కాస్త వెడల్పుగా వత్తి వేయించుకుంటే లోపలి వరకు కాలి ఉడుకుతుంది. కీమా కీమా ముట్టీలు మసాలా కూర - 10 కావలసిన పదార్థాలు కొత్తిమీర కొద్దిగా 250గ్రా. ఉల్లిపాయలు 3 ధనియాల పొడి అల్లం, వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్స్ పసుపు 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి టమాటాలు 2 టీ స్పూన్స్ 1/2 టీ స్పూన్ కారంపొడి 2 టీ స్పూన్స్ ఉప్పు కొబ్బరిపొడి కరివేపాకు 4 టీ స్పూన్స్ రెబ్బలు నూనె 2 తగినంత 4 టేబుల్ స్పూన్స్ తయారుచేసే విధానం కీమాలో సగం పసుపు, కారం, ధనియాల పొడి, గరంమసాలా పొడి, కొబ్బరిపొడి, సగం అల్లం వెల్లుల్లి ముద్ద, తగినంత ఉప్పు వేసి బాగా కలిసేలా దంచుకోవాలి. లేదా మిక్సీలో కొద్దిగా తిప్పితే చాలు. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, చెంచాడు నూనె వేసి కలిపి, చిన్న నిమ్మకాయంత ఉండలు చేసుకుని కాస్త వెడల్పుగా వత్తి పక్కన పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించి పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం వేసి కలపాలి. ఇందులో ముట్టీలు వేసి మంట తగ్గించి మూత పెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత మెల్లిగా తిప్పాలి. రెండో వైపు కూడా బాగా వేపి గట్టిపడిన తర్వాత ధనియాల పొడి, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, మిగిలిన సగం కొబ్బరి పొడి వేసి కలిపి మూత పెట్టాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత అరకప్పు నీళ్లు పోసి కలిపి చిన్న మంట మీద ఉడికించాలి. ముట్టీలు ఉడికి నూనె తేలుతున్నప్పుడు గరం మసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. తెలంగాణ 226 రుచుల
పుట:తెలంగాణ రుచులు.pdf/247
స్వరూపం