బొక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర బొక్కల / శంఖుల చారు - 29 కావలసిన పదార్థాలు కారంపొడి ధనియాల పొడి అల్లం, వెల్లుల్లి ముద్ద ఉప్పు 500 గ్రా. 1 3 2 రెబ్బలు కొద్దిగా నూనె - టీ 1/4 టీ స్పూన్ - 1 టీ స్పూన్ 1 టీ స్పూన్స్ 1 టీ స్పూన్ తగినంత 2 టీ స్పూన్స్ పసుపు తయారుచేసే విధానం బొక్కలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు, వేసి కొద్దిగా వేపాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపి బొక్కలు, కారంపొడి, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత నాలుగు గ్లాసుల నీళ్లు పోసి ఉడికించాలి. బొక్కలు ఉడికి శోరువ సగం అయ్యాక ధనియాల పొడి, కొత్తిమీర వేసి మరో రెండు నిమిషాలు మరిగించి దింపేయాలి. బొక్కల శోరువ / సూపు - 30 కావలసిన పదార్థాలు 250 గ్రా. 100 గ్రా. 1 చిన్నది కొత్తిమీర ఉప్పు మిరియాలపొడి బొక్కలు కందిపప్పు ఉల్లిపాయ - పచ్చిమిర్చి - 3 పుదీనా ఆకులు - 10 కొద్దిగా చిన్న ముక్క తగినంత 1/2 టీ స్పూన్ నూనె లేదా వెన్న 1 టీ స్పూన్ తయారుచేసే విధానం కుక్కర్లో శుభ్రంగా కడిగిన బొక్కలు తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కందిపప్పు, సన్నగా తరిగిన అల్లం, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి నాలుగు గ్లాసుల నీళ్లు పోసి ఆరేడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. తర్వాత వేడిగా త్రాగాలి. జబ్బు, జలుబు చేసినపుడు, నీరసంగా ఉన్నప్పుడు ఇలా శోరువ / సూపు చేసుకుంటే చాలా మంచిది. తెలంగాణ 221 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/242
స్వరూపం