Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మాంసం కందిపప్పు ఉల్లిపాయలు మెంతికూర అల్లం, వెల్లుల్లి ముద్ద తయారుచేసే విధానం మాంసం, మెంతికూర పప్పు - 23 కావలసిన పదార్థాలు పసుపు 1/2 టీ స్పూన్ 500 గ్రా. కారంపొడి 12 టీ స్పూన్స్ 200 గ్రా. గరం మసాలా పొడి 1/4 టీ స్పూన్ 2 తగినంత 2 చిన్న కట్టలు ఉప్పు 1 టీ స్పూన్ నూనె 4 టేబుల్ స్పూన్స్ కందిపప్పు కడిగి, నీళ్లు పోసి కొద్దిగా పసుపు, నూనె వేసి మెత్తగా ఉడికించు కోవాలి. మాంసం శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, సన్నగా తరిగిన మెంతికూర, అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేగిన తర్వాత కారంపొడి వేసి కలపాలి. మాంసం ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా వేయించాలి. ముక్కలు వేగిన తర్వాత నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. ముక్కలు ఉడికిన తర్వాత పప్పు, దానికి తగినంత ఉప్పు వేసి కలిపి ఉడికించాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత గరం మసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. మాంసం 500 గ్రా. కందిపప్పు 200 గ్రా. కరివేపాకు 2 రెబ్బలు మాంసం, పుల్ల పప్పు - 24 కావలసిన పదార్థాలు కారంపొడి ధనియాల పొడి గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్స్ 2 టీ స్పూన్స్ 1/4 టీ స్పూన్ ఉల్లిపాయలు 2 చింతపండు పులుసు 1/4 కప్పు తగినంత అల్లం, వెల్లుల్లి ముద్ద పసుపు 1/2 టీ స్పూన్ ఉప్పు 1/2 టీ స్పూన్ నూనె తయారుచేసే విధానం 4 టేబుల్ స్పూన్స్ కందిపప్పులో తగినన్ని నీళ్లు పోసి కొంచెం పసుపు, కొంచెం నూనె వేసి మెత్తగా ఉడికించుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించి, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. ఇందులో కారంపొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా వేపి మాంసం ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలుపుతూ వేయించాలి. ముక్కలు బాగా వేగిన తర్వాత నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. మాంసం ముక్కలు ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత కందిపప్పు, దానికి తగినంత ఉప్పు వేసి కలిపి ఉడికించాలి. ఇంకో ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత గరం మసాలా పొడి వేసి దింపేయాలి. తెలంగాణ 218