మాంసం, ఆకుకూరలు - 19 కావలసిన పదార్థాలు పసుపు మాంసం పాలకూర 500 గ్రా. 5 కట్టలు కారంపొడి కొయిగూర సోయకూర 3 కట్టలు 1 కట్ట ధనియాల పొడి గరం మసాలా పొడి ఉల్లిపాయలు 2 ఉప్పు పచ్చిమిర్చి 00 3 నూనె అల్లం, వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్స్ I 1/2 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ 2 టీ స్పూన్స్ 1/2 టీ స్పూన్ తగినంత 4 టేబుల్ స్పూన్స్ తయారుచేసే విధానం పాలకూర, కొయిగూర, సోయకూర కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేపి శుభ్రంగా కడిగిన మాంసం ముక్కలు, కారంపొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. ముక్కలు బాగా వేగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. ముక్కలు బాగా వేగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికిన తర్వాత ఆకుకూరలన్నీ వేసి కలిపి ఉప్పు సరిచూసుకుని మూతపెట్టి ఉడికించుకోవాలి. ఆకుకూర బాగా మగ్గి, దగ్గర పడ్డాక గరంమసాలా పొడి వేసి మాంసం, చింతచిగురు, మామిడికాయ కూర - 20 కావలసిన పదార్థాలు మాంసం చింతచిగురు 500 గ్రా. కారంపొడి 1/2 టీ స్పూన్స్ 1/2 కప్పు మామిడికాయ 1 ధనియాల పొడి గరం మసాలా పొడి 2 టీ స్పూన్స్ 1/2 టీ స్పూన్ ఉల్లిపాయలు 2 అల్లం, వెల్లుల్లి ముద్ద పచ్చిమిర్చి 4 కరివేపాకు రెబ్బలు 1/2 టీ స్పూన్ ఉప్పు నూనె 2 టీ స్పూన్స్ తగినంత 4 టేబుల్ స్పూన్స్ పసుపు తయారుచేసే విధానం మామిడికాయ చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేగిన తర్వాత మాంసం ముక్కలు, కారంపొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా వేయించాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. ముక్కలు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు కలపాలి. చింతచిగురును బాగా నలిపి అందులో వేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. మొత్తం ఉడికి దగ్గర పడ్డాక గరంమసాలా పొడి కలిపి దింపేయాలి. తెలంగాణ 216 రుచుల
పుట:తెలంగాణ రుచులు.pdf/237
స్వరూపం