మాంసం, పుంటికూర, శనగపప్పు కూర - 13 కావలసిన పదార్థాలు మాంసం 500 గ్రా. పసుపు పుంటికూర శనగపప్పు 6, 8 కట్టలు కారంపొడి 100 గ్రా. ఉల్లిపాయలు 2 ధనియాల పొడి గరం మసాలా పొడి పచ్చిమిర్చి 4 ఉప్పు అల్లం, వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్స్ నూనె తయారుచేసే విధానం 1/2 టీ స్పూన్ టీ 2 టీ స్పూన్స్ 2 టీ స్పూన్స్ 1/2 టీ స్పూన్ తగినంత 4 టేబుల్ స్పూన్స్ పుంటికూర ఆకులన్నీ ఏరి శుభ్రంగా కడిగి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. చల్లారిన తర్వాత పచ్చిమిర్చితో కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. శనగపప్పు నీళ్లు పోసి అరగంట ముందు నానబెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేపి, కారంపొడి, ధనియాల పొడి వేయాలి. మాంసం ముక్కలు, శనగపప్పు, తగినంత ఉప్పు వేసి కలుపుతూ వేయించాలి. మాంసం ముక్కలు వేగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. ముక్కలు, పప్పు ఉడికిన తర్వాత పుంటికూర ముద్ద, గరం మసాలా పొడి వేసి కలిపి ఉప్పు సరిచూసుకొని మూతపెట్టి ఉడికించాలి. మొత్తం ఉడికిన తర్వాత కలిపి దింపేయాలి. ఇందులో శనగపప్పు లేకుండా ఉత్త పుంటికూర మాత్రమే ఉడికించి కలుపుకోవచ్చు. మాంసం, మామిడికాయ - 14 కావలసిన పదార్థాలు మాంసం 250 గ్రా. పసుపు మామిడికాయ 1 కారంపొడి 1/4 టీ స్పూన్ 11/2 టీ స్పూన్స్ ఉల్లిపాయలు 2 ధనియాల పొడి కరివేపాకు 2 రెబ్బలు గరం మసాలా పొడి 1 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ పచ్చిమిర్చి 4 కొత్తిమీర ఉప్పు నూనె తగినంత 4 టేబుల్ స్పూన్స్ అల్లం, వెల్లుల్లి ముద్ద తయారుచేసే విధానం కొద్దిగా 1/2 టీ స్పూన్స్ మాంసం ముక్కలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మామిడికాయ చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపి మాంసం ముక్కలు, కారంపొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. ముక్కలు బాగా వేగిన తర్వాత నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. మాంసం ముక్కలు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు కలిపి మెత్తగా అయ్యేవరకు ఉడికించి గరం మసాలా పొడి వేసి దింపేయాలి. మామిడికాయ తురుము కూడా వేసుకోవచ్చు. తెలంగాణ 213 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/234
స్వరూపం