Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మాంసం, మిరియాల పొడి కూర - 5 కావలసిన పదార్థాలు మాంసం 250గ్రా. ధనియాల పొడి 1 టీ స్పూన్ ఉల్లిపాయలు 2 గరం మసాలా పొడి 1/4 టీ స్పూన్ పచ్చిమిర్చి కొత్తిమీర 6 మిరియాల పొడి 1/4 టీ స్పూన్ కొద్దిగా ఉప్పు తగినంత పసుపు 1/4 టీ స్పూన్ నూనె 3 టేబుల్ స్పూన్స్ తయారుచేసే విధానం గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన లేదా నూరిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేపి శుభ్రంగా కడిగిన మాంసం ముక్కలు వేసి కలపాలి. ధనియాల పొడి, ఉప్పు వేసి కలుపుతూ వేయించాలి. ముక్కలు వేగిన తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. ముక్కలు ఉడికిన తర్వాత మిరియాలపొడి, కొత్తిమీర వేసి చిక్కబడేవరకు ఉంచాలి. చివరగా గరం మసాలా పొడి వేసి దింపేయాలి. ఇందులో పచ్చిమిర్చి కారం బదులు ఎండుమిర్చి కారం వేసుకోవచ్చు. మాంసం టమాటాలు ఉల్లిపాయలు కరివేపాకు పసుపు కారంపొడి I మాంసం, టమాటా కూర - 6 250గ్రా. కావలసిన పదార్థాలు ధనియాల పొడి గరం మసాలా పొడి 2 అల్లం, వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్ 1/4 టీ స్పూన్ 1 టీ స్పూన్ 2 రెబ్బలు 1/4 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ ఉప్పు తగినంత నూనె 3 టేబుల్ స్పూన్స్ తయారుచేసే విధానం గిన్నెలో నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేపి మాంసం ముక్కలు, కారంపొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. ముక్కలు బాగా వేగిన తర్వాత రెండుకప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. ముక్కలు ఉడికిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత గరం మసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. తెలంగాణ 209 రుచులు