Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ORES తెలంగాణ రుచులు 1. తెలంగాణ రుచులు చరిత్ర - సంప్రదాయం ఆరోగ్యమే మహాభాగ్యం అని మనకు అందరికీ తెలిసిందే. ఆహారం మనకు శక్తినిస్తుంది. ఆరోగ్యాన్నిస్తుంది కాని అది పోషక విలువలతో కూడినదై మొదలైనవి వుండాలి. అందరూ తమ ఆహారంలో అన్నిరకాల ఆహారపదార్థాలు బియ్యం, గోధుమలు, జొన్నలు, కొర్రలు, మొక్కజొన్నలు, రాగులు తీసుకోవడం చాలా మంచిది. వీటితోపాటు పప్పులు, కాయగూరలు, ఆకుకూరలు, మాంసాహారం తీసుకోవాలి. ఆహారంలోని పోషకపదార్థాలు ఎన్నో రోగాల నుండి మనల్ని రక్షిస్తాయి. ఆహారాన్ని సంపాదించడానికి మనిషి పడరాని పాట్లు పడ్డాడు. రాతియుగంలో కొండలు, కోనలు, అడవులలో తిరుగుతూ సముపార్జించడం కోసం ఆకులు, దుంపలు, కాయలు తింటూ కాలం గడిపాడు. ఆ సమయంలో వాళ్లకి అవసరాలు చాలా తక్కువ. కాలం మారుతున్న కొద్ది అవసరాలు పెరిగాయి. కుటుంబం కోసం కూడబెట్టిన ఆహారం సరిపోక స్వంతంగా ఆహారాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం అనువైన భూముల దగ్గరే నివాసం ఏర్పాటు చేసుకొని వ్యవసాయం మొదలుపెట్టి పంటలను పండించసాగాడు. ప్రాచీన మానవుడు ఆకలైనప్పుడు పళ్లు, దుంపలు పచ్చివే తిన్నాడు. తర్వాత వాటిని ఉడికించుకున్నాడు. క్రమక్రమంగా ఆహారాన్ని పండించి, వండి తినడం ప్రారంభించాడు. ప్రజల ఆహారపు అలవాట్లు వారు నివసించే భౌగోళిక వాతావరణం మీద ఆధారపడి ఉంటాయి. వీటికనుగుణంగానే వివిధ పంటలను పండించి, తమ ఆహారంగా సమకూర్చుకుంటారు. సముద్రతీరాలు, నదీతీరాలలో, చెరువులు, వాగులు ఉన్న ప్రాంతాలలో ప్రజలు ఎక్కువగా చేపలు, రొయ్యలు మొదలైనవి తమ ఆహారంలో ఉపయోగిస్తారు. అడవీ ప్రాంతంలో నివసించేవారు జంతువుల మాంసం, పండ్లు, దుంపలు, తేనె, ఆకులను తింటారు. సముద్రతీరానికి, అడవులకు దూరంగా ఉండేవారు పెంపుడు జంతువుల మాంసం, పంటల వల్ల వచ్చే ధాన్యం, కూరగాయలను తమ ఆహారంలో భాగంగా చేసుకొని తింటారు. వేర్వేరు ప్రాంతాల ప్రజల ఆహారపుటలవాట్లు వాళ్లు ఉండే ప్రాంతంపై కూడా ఆధారపడి ఉంటాయి. నల్లనేలలో కొన్ని రకాలు, ఎర్రనేలలో కొన్ని రకాల పంటలు విరివిగా పండుతాయి. అలాగే వానలు ఎక్కువగా కురిసే ప్రాంతాలలో వరి, గోధుమలు లాంటివి, వానలు తక్కువగా కురిసే ప్రాంతాలలో కొర్రలు, జొన్నలు, సజ్జలు, సామలతో పాటు పెసర్లు, ఉలవలు, మినుములు మొదలైన పప్పుధాన్యాలను కూడా పండిస్తారు. సాహిత్యంలో ఆహారం: ప్రాచీన సాహిత్యంలో ఆయా ప్రాంతాల ఆహారపు అలవాట్లు, పంటల గురించి వివరించడం జరిగింది. కాకతీయుల కాలంనాటి శాసనాల ద్వారా ఓరుగల్లు కోట బయట సంతలో ఆకులు, కూరగాయలు, టెంకాయలు, మామిడిపళ్ళు, చింతపండు, నువ్వులు, గోధుమలు నూనె, నెయ్యి, జొన్నలు, మిరియాలు, పసుపు, ఉల్లి, అల్లం మొదలైన దినుసులు అమ్మేవారని తెలుస్తోంది. 'ఓరుగల్లు 2