Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2. మాంసం మాంసం ఇగురు - 1 కావలసిన పదార్థాలు మాంసం ఉల్లిపాయలు 250 గ్రా. ధనియాల పొడి 2 గరం మసాలా పొడి 1 టీ స్పూన్స్ 1/4 టీ స్పూన్ పచ్చిమిర్చి 3 కొబ్బరిపొడి 3 టీ స్పూన్స్ పసుపు 1/4 టీ స్పూన్ అల్లం, వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్స్ 2 రెబ్బలు ఉప్పు తగినంత 1 టీ స్పూన్ నూనె 3 టేబుల్ స్పూన్స్ కరివేపాకు కారంపొడి తయారుచేసే విధానం గిన్నెలో నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి కొద్దిగా వేపి, శుభ్రంగా కడిగిన మాంసం వేసి కలపాలి. తర్వాత కారం పొడి, ధనియాల పొడి తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి. నీరంతా ఇగిరిపోయి, ముక్కలు బాగా వేగిన తర్వాత రెండుకప్పుల నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. మాంసం ముక్కలు ఉడికిన తర్వాత కొబ్బరి పొడి వేసి కలిపి చిక్కబడే వరకు ఉడికించాలి. నూనె తేలుతున్నప్పుడు గరంమసాలా పొడి కలిపి దింపేయాలి. మాంసం ఇగురు - 2 కావలసిన పదార్థాలు మాంసం 250 గ్రా. ధనియాల పొడి గరం మసాలా పొడి ఉల్లిపాయలు 3 కరివేపాకు 2 రెబ్బలు అల్లం, వెల్లుల్లి ముద్ద పసుపు 1/4 టీ స్పూన్ ఉప్పు కారంపొడి 1 టీ స్పూన్ నూనె 1 టీ స్పూన్స్ 1/4 టీ స్పూన్ 1 టీ స్పూన్స్ తగినంత 3 టేబుల్ స్పూన్స్ తయారుచేసే విధానం గిన్నెలో నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేపి మాంసం ముక్కలు, కారంపొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. ముక్కలునూనెలో కాస్త వేగిన తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. మాంసం ముక్కలు ఉడికి చిక్కబడ్డాక గరంమసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. తెలంగాణ 207 రుచులు