కోడి మామిడికాయ కూర - 13 కావలసిన పదార్థాలు కోడి 1 కేజి గసాలు 3 టీ స్పూన్స్ మామిడికాయలు 2 చిన్నవి పసుపు 1/2 టీ స్పూన్ ఉల్లిపాయలు 3 కారంపొడి 1/2 టీ స్పూన్ పచ్చిమిర్చి 4 గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్ అల్లం, వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్స్ కొత్తిమీర కొద్దిగా పెరుగు 1/2 కప్పు ఉప్పు తగినంత 3 టీ స్పూన్స్ నూనె 4 టేబుల్ స్పూన్స్ కొబ్బరిపొడి తయారుచేసే విధానం మామిడికాయను తురిమి లేదా చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. గసాలు వేయించి కొబ్బరితో కలిపి పొడిచేసి పెరుగు కలిపి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించి, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారంపొడి, ధనియాల పొడి, వేసి కలిపి కోడిముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. ముక్కలు బాగా వేగిన తర్వాత మామిడికాయ తురుము వేసి రెండు నిమిషాలు వేపాలి. తరవాత కొబ్బరి, గసాల ముద్ద, కప్పుడు నీళ్లు వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. కోడి బాగా ఉడికి నూనె తేలుతున్నప్పుడు గరంమసాలాపొడి, కొత్తిమీర వేసి దింపేయాలి. కోడి వేపుడు - 1 కావలసిన పదార్థాలు కో పసుపు 1 కేజి కారంపొడి 12 టీ స్పూన్స్ 1/2 టీ స్పూన్ మిరియాల పొడి 1/4 టేబుల్ స్పూన్ అల్లం, వెల్లుల్లి ముద్ద ధనియాల పొడి 2 టీ స్పూన్ ఉప్పు తగినంత 2 టీ స్పూన్స్ నూనె టీ 1/2 టీ స్పూన్ కొత్తిమీర గరం మసాలా పొడి తయారుచేసే విధానం 4 టేబుల్ స్పూన్స్ కొద్దిగా కోడిముక్కలు శుభ్రంగా కడిగి జల్లెట్లో వేయాలి. నీరంతా పోయాక ఒక గిన్నెలోకి తీసుకొని పసుపు, కారం, ధనియాల పొడి, గరంమసాలా పొడి, మిరియాల పొడి, తగినంత ఉప్పు, నూనె కూడా వేసి అన్ని ముక్కలకు మసాలా అంటేలా బాగా కలియబెట్టాలి. మూతపెట్టి గంటసేపు ఉంచాలి. మందంగా ఉన్న కడాయిలో చికెన్, మసాలాతో కలిపి వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి చిన్న మంటమీద వేయించి, కొత్తిమీర చల్లి దింపేయాలి. తెలంగాణ 204
పుట:తెలంగాణ రుచులు.pdf/225
స్వరూపం