కోడి, మెంతికూర - 9 కావలసిన పదార్థాలు ధనియాల పొడి గరం మసాలా పొడి పెరుగు 2 టీ స్పూన్స్ 1/2 టీ స్పూన్ 1 కప్పు కోడి 1 కేజి ఉల్లిపాయలు పచ్చిమిర్చి 3 4 మెంతికూర తరుగు 1/4 కప్పు టమాటాలు అల్లం, వెల్లుల్లి ముద్ద 112 టీ స్పూన్ ఉప్పు పసుపు 1/2 టీ స్పూన్ నూనె టీ 2 టీ స్పూన్స్ 3 తగినంత 3 టేబుల్ స్పూన్స్ కారంపొడి తయారుచేసే విధానం గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. ఇందులో మెంతికూర తరుగు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేగిన తర్వాత కారంపొడి, ధనియాలపొడి వేయాలి. కోడిముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి. నీరంతా ఇగిరిపోయి ముక్కలు వేగిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి కలపాలి. అవి కాస్త మెత్తబడ్డాక పెరుగు, కప్పుడు నీళ్లు పోసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. ముక్కలన్నీ ఉడికి నూనె తేలుతున్నప్పుడు గరం మసాలా పొడి వేసి దింపేయాలి. నాటుకోడి పులుసు - 10 కావలసిన పదార్థాలు కోడి పసుపు ఉల్లిపాయలు కారంపొడి ధనియాల పొడి గరం మసాలా పొడి తయారుచేసే విధానం I 1 కేజి 1/2 టీ స్పూన్ 2 అల్లం, వెల్లుల్లి ముద్ద కొబ్బరిపొడి చింతపండు పులుసు 2 టీ స్పూన్ 3 టేబుల్ స్పూన్స్ 1/2 కప్పు తగినంత 2 టీ స్పూన్స్ ఉప్పు 2 టీ స్పూన్స్ నూనె 4 టేబుల్ స్పూన్స్ 1/2 టీ స్పూన్ నాటుకోడి మంట మీద కాల్చి కొంచెం పసుపు రాసి కడిగి ముక్కలు చేసి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యేవరకు వేయించాలి. ఇందులో పసుపు, అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి కలిపి, కోడి ముక్కలు, కారంపొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి. ముక్కలు బాగా వేగిన తర్వాత కొబ్బరిపొడి వేసి కలపాలి. ఇందులో కప్పుడు నీళ్లు పోసి కలిపి చిన్న మంట మీద ఉడికించాలి. ముక్కలు బాగా ఉడికిన తర్వాత గరంమసాలా, చింతపండు పులుసు వేసి కలిపి మరో ఐదు నిమిషాలు ఉడికించి నూనె తేలిన తర్వాత దింపేయాలి. తెలంగాణ 202 రుచుల
పుట:తెలంగాణ రుచులు.pdf/223
స్వరూపం