తెలంగాణ గ్రుడ్లు శనగపిండి కారంపొడి ధనియాల పొడి | 4 కోడిగ్రుడ్డు బజ్జీలు - 16 కావలసిన పదార్థాలు వాము 1 కప్పు ఉప్పు 1 టీ స్పూన్ నూనె 2 టీ స్పూన్స్ 1 టీ స్పూన్ తగినంత వేయించడానికి తయారుచేసే విధానం గ్రుడ్లు ఉడకబెట్టి పెంకు తీసి చాకుతో రెండు లేదా నాలుగు ముక్కలుగా చేసుకోవాలి. ఒక గిన్నెలో జల్లించిన శనగపిండి, కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి, వాము, వంటసోడా, గరిటెడు నూనె వేసి కలిపి తగినన్ని నీళ్లతో మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసుకోవాలి. ఒక్కో గుడ్డు ముక్క పిండిలో పూర్తిగా ముంచి వేడినూనెలో వేసి రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుని తీసుకోవాలి. గ్రుడ్లు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కొబ్బరిపొడి గసాలపొడి ☐ I + 2 3 కోడిగ్రుడ్లు మసాలా కూర - 17 కావలసిన పదార్థాలు ధనియాల పొడి గరం మసాలా పొడి 1 2 రెబ్బలు 2 టీ స్పూన్స్ 1/2 టీ స్పూన్ అల్లం, వెల్లుల్లి ముద్ద పసుపు 1 టీ స్పూన్ 1/4 టీ స్పూన్ కారంపొడి 1/2 టీ స్పూన్ తగినంత, 4 టీ స్పూన్స్ కొద్దిగా ఉప్పు 4 టీ స్పూన్స్ 2 టీ స్పూన్స్ నూనె తయారుచేసే విధానం గ్రుడ్లు ఉడకబెట్టి పెంకు తీసి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి బంగారురంగులోకి మారేవరకు వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపి సన్నగా తరిగిన టమాటా ముక్కలు, కారంపొడి వేసి కలిపి మూత పెట్టాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ధనియాలపొడి, కొబ్బరిపొడి, గసాలపొడి, తగినంత ఉప్పు వేసి రెండునిమిషాలు వేయించి ఉడికించిన గ్రుడ్లు, కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. మొత్తం నీరంతా ఇగిరి పోయి నూనె తేలుతున్నప్పుడు గరం మసాలా, కొత్తిమీర వేసి దింపేయాలి. 196
పుట:తెలంగాణ రుచులు.pdf/217
స్వరూపం