గ్రుడ్లు ఉల్లిపాయ పచ్చిమిర్చి 4 కోడిగ్రుడ్లు మసాలా వేపుడు - 10 00 కావలసిన పదార్థాలు ధనియాల పొడి కొబ్బరి పొడి 2 టీ స్పూన్స్ 2 టీ స్పూన్స్ 6-8 గసాలు 2 టీ స్పూన్స్ అల్ల అర అంగుళం ముక్క ఉప్పు తగినంత పసుపు 1/4 టీ స్పూన్ నూనె 5 టీ స్పూన్స్ కొత్తిమీర తరుగు 1/4 కపు తయారుచేసే విధానం కోడిగ్రుడ్లు ఉడికించి పెంకు తీసి, చాకుతో గాట్లు పెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం కలిపి మెత్తగా నూరుకోవాలి. ధనియాలు, గసాలు నూనె లేకుండా వేయించి కొబ్బరితో కలిపి పొడి చేసుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసి ఉల్లిముద్ద వేసి దోరగా వేపాలి. ఇందులో పసుపు, గ్రుడ్లు, మసాలా పొడి తగినంత ఉప్పు వేసి కలుపుతూ వేయించాలి. పూర్తిగా దగ్గర పడ్డాక సన్నగా తరిగిన కొత్తిమీర వేసి దింపేయాలి. కోడిగ్రుడ్లు, ఉల్లిపాయ పులుసు - 11 కావలసిన పదార్థాలు గ్రుడ్లు ఉల్లిపాయ 4 గరం మసాలా పొడి 1/4 టీ స్పూన్ అల్లం, వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్ పచ్చిమిర్చి 2 చింతపండు పులుసు 1/4 కప్పు 2 రెబ్బలు ఉప్పు తగినంత 1/4 టీ స్పూన్ నూనె 3 టీ స్పూన్స్ 1 టీ స్పూన్ కరివేపాకు పసుపు కారంపొడి తయారుచేసే విధానం కోడిగ్రుడ్లు ఉడకబెట్టి పెంకు తీసిపెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి కలిపి కారం పొడి వేసి కొద్దిగా వేగిన తర్వాత చింతపండు పులుసు, ఉడికించిన గ్రుడ్లు, కప్పుడు నీళ్లు, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టి చిక్కబడేవరకు ఉడికించి, గరంమసాలా పొడి వేసి దింపేయాలి. తెలంగాణ 193 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/214
స్వరూపం