Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రుడ్లు ఉల్లిపాయ టమాటాలు చిన్న మెంతికూర పసుపు టమాటా, గ్రుడ్లు మసాలా కూర - 8 కావలసిన పదార్థాలు గరం మసాలా పొడి కొబ్బరిపొడి షాజీర 1/4 చెంచా 3 చెంచాలు 3 1 2 1 చెంచా 1 కట్ట అల్లం, వెల్లుల్లి ముద్ద 1/4 చెంచా ఉప్పు 1 చెంచా తగినంత నూనె 4 చెంచాలు కారంపొడి ధనియాల పొడి 1 చెంచా తయారుచేసే విధానం గిన్నెలో నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, షాజీర వేసి మెత్తబడేవరకు వేయించాలి. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద శుభ్రంగా కడిగి తరిగిన మెంతికూర వేసి మరికొద్దిసేపు వేయించాలి. సన్నగా తరిగిన టమాటాలు, కొబ్బరిపొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. బాగా మెత్తబడ్డాక గ్రుడ్లు కొట్టి వేసి మెల్లిగా కలిపి మూత పెట్టాలి. గ్రుడ్డు ఉడికిన తర్వాత గరంమసాలా పొడి వేసి కలిపి మరికొద్దిసేపు వేయించి దింపేయాలి. గ్రుడ్లు పసుపు కారంపొడి కోడిగ్రుడ్లు వేపుడు - 9 కావలసిన పదార్థాలు కరివేపాకు 2 రెబ్బలు 6 1/4 టీ స్పూన్ అల్లం, వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్ తగినంత 1 టీ స్పూన్ ఉపు 2 టీ స్పూన్స్ నూనె 4 టీ స్పూన్స్ ధనియాల పొడి తయారుచేసే విధానం గ్రుడ్లు ఉడకబెట్టి పెంకు తీసి చాకుతో గాట్లు పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసి ఈ గ్రుడ్లు వేసి అన్నివైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత కారంపొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుతూ వేయించి తీసుకోవాలి. పైనుండి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవచ్చు. తెలంగాణ 192