Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గసగసాల సద్ది కావలసిన వస్తువులు బియ్య 500 గ్రా. మినపప్పు 20 గ్రా. గసగసాల పొడి 80 గ్రా. శనగపప్పు 20 గ్రా. పల్లీలు 40 గ్రా. ఇంగువ కొంచెం కరివేపాకు 10 గ్రా. ఎండుమిర్చి 6 తగినంత పచ్చిమిర్చి 25 గ్రా. ఉప్పు ఒక స్పూన్ నూనె 80 LT. నువ్వులు 10 గ్రా. 5 గ్రా. 5 గ్రా. కారం జీలకర్ర తయారుచేసే విధానం పొయ్యిమీద కడాయి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక ఇంగువ, ఎండుమిర్చి, తరువాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, నువ్వులు, పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఆ తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అన్నం వండుకొని చల్లార్చిన తరువాత తాలింపు వేసి, కారం, ఉప్పు, గసగసాల పొడి వేసి కలుపుకోవాలి. పెసరపిండి సద్ది కావలసిన వస్తువులు 5 T°. ఆవాలు బియ్య పెసరపిండి 500 గ్రా. 100 గ్రా. మినపప్పు 20 UT°. (పెసలు వేయించుకొని పొడి చేసుకోవాలి) శనగపప్పు 20 గ్రా. ఇంగువ - ఎండుమిర్చి కొంచెం 6 పల్లీలు 40 గ్రా. కరివేపాకు 10 గ్రా. పచ్చిమిర్చి 25 గ్రా. ఉప్పు కారం ఒక స్పూన్ నూనె తగినంత 80 LT. 5 గ్రా. నువ్వులు 10 గ్రా. తయారుచేసే విధానం పొయ్యిమీద కడాయి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక ఇంగువ, ఎండుమిర్చి, తరువాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, నువ్వులు, పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఆ తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అన్నం వండుకొని చల్లార్చిన తరువాత తాలింపు వేసి, కారం, ఉప్పు, పెసరపిండి వేసి కలుపుకోవాలి. తెలంగాణ 177 రుచులు