శనగపిండి 100 గ్రా. 25 గ్రా. 400గ్రా. కొత్తిమీర బేసిన్ కావలసిన వస్తువులు బియ్యంపిండి కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ 80 LT. అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు 60 LT.ex 1/2 స్పూన్ ఆవాలు జీలకర్ర నూనె ఉప్పు 5 గ్రా. 5 గ్రా. 120 గ్రా. తగినంత ఉల్లిపాయలు 2 తయారుచేసే విధానం ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మగ్గిన తర్వాత కొత్తిమీర వేసి 125 మి.లీ. నీరు పోసి, పచ్చిమిర్చి పేస్ట్ వేసి, కొత్తిమీర మగ్గిన తర్వాత నీళ్లుగా ఉన్నప్పుడే శనగపిండి, బియ్యంపిండి వేసి సన్నని సెగమీద 15 నిమిషాలు బాగా కలపాలి. ఆ తర్వాత కొంచెం నూనె పోసి 5 నిమిషాలు మగ్గిన తర్వాత ముద్దగా వచ్చేవరకు కలుపుకోవాలి. ఇది చపాతీ లేదా అన్నంలోకి బావుంటుంది. కొబ్బరిపాల చారు కావలసిన వస్తువులు కొబ్బరికాయలు పచ్చిమిర్చి 2 జీలకర్ర 5 గ్రా. 7 మినపప్పు 5 గ్రా. అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ 1/2 స్పూన్ పసుపు 1 ఉపు నూనె ఆవాలు 30గ్రా. 5 గ్రా. కొత్తిమీర 1/2 స్పూన్ తగినంత 1 కట్ట కరివేపాకు 10 రెమ్మలు తయారుచేసే విధానం కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి గ్రైండర్ లో వేసి ఒక గ్లాస్ నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక శుభ్రమైన తెల్లని వస్త్రం తీసుకొని మెత్తగా చేసుకున్న కొబ్బరి పేస్ట్ని అందులోకి తీసుకొని కొబ్బరిపాలను తయారుచేసుకోవాలి. కొబ్బరిపాలు చిక్కగా ఉండేలా చూసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో నూనె వేసి జీలకర్ర, ఆవాలు వేసి వేగిన తర్వాత మినపప్పు వేసుకొని తర్వాత మిర్చి వేసి, కాస్త వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మగ్గిన తర్వాత పసుపువేసి కొబ్బరిపాలు అందులో పోసి వేడి చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి కొబ్బరిపాలు చల్లగా అయిన తర్వాత అందులో ఉప్పు, నిమ్మకాయ రసం వేసుకోవాలి. తెలంగాణ 175 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/196
స్వరూపం