చామకూర పొట్లాలు కావలసిన వస్తువులు చామ ఆకులు శనగపప్పు 20 అల్లం వెల్లుల్లి పేస్టు - 60 LT.CO 500 గ్రా.లు పసుపు ఉల్లిపాయలు 1/2 స్పూన్ 2 కప్పులు నూనె 100 గ్రా.లు ఉప్పు వేయించడానికి సరిపడినంత తగినంత (2 గంటలు నానబెట్టుకోవాలి) కొబ్బరి తురుము పచ్చిమిర్చి తయారుచేసే విధానం శనగపప్పు నాలుగు గంటలు నానబెట్టి, జల్లెట్లో వేసి నీరంతా పోయి తడి ఆరాక పేస్టు చేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి పేస్టు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి తురుము, పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఆ తరువాత చామ ఆకుని తీసుకొని ముద్దగా చేసుకున్న మిశ్రమాన్ని కొంచెం ఆకులో పెట్టి పొట్లంలా దారంతో చుట్టాలి. అన్ని ఆకులని అలాగే చేసుకోవాలి. ఆ తరువాత 20 నిమిషాలు ఆవిరి పట్టుకోవాలి. ఆ తరువాత కడాయిలో నూనె వేసి వేడయ్యాక చామకూర పొట్లాలను నిదానంగా, దోరగా వేయించుకోవాలి. చామ ఆకులు 10 పెసరపప్పు 250 గ్రా. ఎండుమిర్చి 50 గ్రా. చామకూర ముద్దకూర కావలసిన వస్తువులు పసుపు ఆవాలు జీలకర్ర 1/2 స్పూన్ 5 గ్రా. 5 గ్రా. ఉల్లిపాయలు 2 ఉపు తగినంత వెల్లుల్లి 40 గ్రా. (చిన్నముక్కలు) నూనె 100 గ్రా. 60 LT. శనగపిండి తయారుచేసే విధానం పెసరపప్పుని మెత్తగా ఉడకబెట్టి సన్నగా తురిమిన చామ ఆకుని అందులో వేసి ఉడకనివ్వాలి. అది పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని అందులో నూనె పోసి ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత ఎండుమిర్చిన తుంపి అందులో వేయాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి కొంచెం మగ్గిన తర్వాత వెల్లుల్లి వేసి, మగ్గిన తర్వాత పసుపు వేసి అందులో శనగపిండి వేసి 10-15 నిమిషాలు సన్న సెగపై బాగా వేయించుకొని ఉడకబెట్టిన పెసరపప్పు, చామకూర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అలా 10-15 నిమిషాలు ముద్దలా అయ్యేవరకు కలపాలి. ఇది చపాతీ లేదా అన్నంలోకి బావుంటుంది. తెలంగాణ 174 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/195
స్వరూపం