అన్న చింతపండు పులుసు 3 కప్పులు చింతపండు పులిహోర కావలసిన వస్తువులు పల్లీలు - 1 కప్పు కరివేపాకు 3 టీస్పూన్లు 2 రెబ్బలు ఎండుమిర్చి 4-5 పసుపు 1/4 టీస్పూన్ ఆవాలు/జీలకర్ర - 1/4 టీస్పూన్ నూనె 3 టీస్పూన్లు మినప్పప్పు 1 టీస్పూన్ ఇంగువ చిటికెడు సెనగపప్పు 1 టీస్పూన్ బెల్లం తయారుచేసే విధానం అన్నం పొడిపొడిగా ఉండేలా వండుకుని చల్లార్చుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేసి కరిగిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా వేగాక మినప్పప్పు, సెనగపప్పు, పల్లీలు, కరివేపాకు వేయాలి. తర్వాత చింతపండు పులుసు, పసుపు, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి. పులుసు బాగా ఉడికి నూనె తేలుతున్నప్పుడు బెల్లం వేసి కలిపి దింపేయాలి. అన్నానికి సరిపడా పులుసు వేసి కలిపి పది నిముషాలు మూత పెట్టి ఉంచితే బాగా ఊరుతుంది. రుచిగా ఉంటుంది. నిమ్మకాయ పులిహోూర కావలసిన వస్తువులు అన్న నిమ్మకాయలు 3 కప్పులు 2 ఎండుమిర్చి ఆవాలు/జీలకర్ర మినప్పప్పు సెనగపప్పు పల్లీలు 3 టీస్పూన్లు కరివేపాకు పసుపు 2. రెబ్బలు 1/4 టీస్పూన్ - 1/4 టీస్పూన్ 1 టీస్పూన్ ఉప్పు తగినంత నూనె 3 1 టీస్పూన్ ఇంగువ చిటికెడు తయారుచేసే విధానం అన్నం పొడిపొడిగా ఉండేలా వండుకుని తగినంత ఉప్పు వేసి కలిపి ఉంచుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేసి కరిగిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత పసుపు, కరివేపాకు, మినప్పప్పు, సెనగపప్పు, పల్లీలు వేసి వేగిన తర్వాత దింపేసి నిమ్మకాయ రసం వేయాలి. ఈ పోపును అన్నంలో వేసి కలపాలి. పది నిమిషాల తర్వాత తినడానికి తయారు. ఇందులో ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి, అప్పుడప్పుడు కాస్త అల్లం ముక్కలు వేసుకోవచ్చు. ఇదే విధంగా దబ్బకాయ, దానిమ్మ, ఉసిరితో కూడా పులిహోర చేసుకోవచ్చు. తెలంగాణ 169 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/190
స్వరూపం