6. అంబలి జొన్న అంబలి కావలసిన వస్తువులు జొన్నపిండి/రవ్వ 3 కప్పులు నీళ్ళు 3 కప్పులు తగినంత ఉప్పు తయారుచేసే విధానం జొన్నలను మరీ మెత్తగా కాకుండా విసురుకుని లేక పొడి చేసుకుని నీళ్లు కలిపి పలుచగా చేసి నిదానంగా ఉడికించుకుని తగినంత ఉప్పు కలిపి దింపేయాలి. జీలకర్ర పొడి వేసుకోవచ్చు. ఇదే పద్ధతిలో రాగులు లేదా తైదలు, కొర్రలతో అంబలి కాచుకోవచ్చు. ఇందులో నీళ్ళతోపాటు అన్నం వార్చిన గంజి కలిపి ఉడికిస్తే మరింత రుచిగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. జొన్న రవ్వ ఉప్పు గట్క/సంకటి కావలసిన వస్తువులు 1 గ్లాసు తగినంత 3 గ్లాసులు నీళ్ళు తయారుచేసే విధానం గిన్నెలో రవ్వకు సరిపడ నీళ్ళు పోసి మరిగించాలి. ఇందులో సరిపడ ఉప్పు వేసి మరుగుతున్నప్పుడు జొన్నరవ్వ వేసి కలిపి చిన్న మంట మీద ఉడికించాలి. ఇది మరీ పలుచగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఉండాలి. గట్కని, జొన్నరవ్వ, మొక్కజొన్న రవ్వ, సద్దలు, రాగులు, కొర్రలతో తయారు చేసుకుంటారు. ఆయా ప్రాంతాలలో విరివిగా ఉండే ధాన్యాలతో ఆయా గట్క తయారు చేసుకుంటారు. తెలంగాణ 163 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/184
స్వరూపం