Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉల్లిపాయ ఉల్లిపాయ సెనగపిండి కూర కావలసిన వస్తువులు ఉల్లిపాయలు 250గ్రా.లు అల్లంవెల్లుల్లి ముద్ద 1 టీస్పూన్ సెనగపిండి పసుపు 3 టీస్పూన్లు ఆవాలు, జీలకర్ర 1/4 టీస్పూన్ ఉప్పు 1/4 టీస్పూన్ తగినంత పచ్చిమిర్చి కరివేపాకు 2 నూనె 3 టీస్పూన్లు 2 రెబ్బలు గరంమసాలా పొడి 1/2 టీస్పూన్ తయారుచేసే విధానం గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, అల్లంవెల్లుల్లి ముద్ద, తగినంత ఉప్పు వేసి కలిపి కాసిని నీళ్ళు చిలకరించి మెత్తగా ఉడికించుకోవాలి. సెనగపిండిలో కాసిన్ని నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలిపి ఉల్లిపాయలలో వేసి కలపాలి. చివరగా గరంమసాలా పొడి కలిపి దింపేయాలి. ఉల్లిగడ్డలు చింతపండు కరివేపాకు పసుపు కారంపొడి జీలకర్ర పొడి మెంతిపొడి తయారుచేసే విధానం 250గ్రా.లు పెద్ద నిమ్మకాయంత 2 రెబ్బలు ఉల్లిగడ్డ పులుసు కావలసిన వస్తువులు అల్లంవెల్లుల్లిముద్ద ధనియాల పొడి ఉప్పు 1 టీస్పూన్ తగినంత 1/2 టీస్పూన్ 3 టీస్పూన్లు ఆవాలు, జీలకర్ర 1/4 టీస్పూన్ కొద్దిగా నూనె - 1/4 టీస్పూన్ - 1 టీస్పూన్ 1 టీస్పూన్ 1/4 టీస్పూన్ చింతపండు నీళ్ళు పోసి నానబెట్టి పలుచగా పులుసు తీసి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లి పాయ ముక్కలు వేసి దోరగా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇందులో పసుపు, కారంపొడి, ధనియాలపొడి, జీలకర్రపొడి, మెంతిపొడి, అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేపి చింతపండు పులుసు పోయాలి. ఇందులో కరివేపాకు, బెల్లం వేసి మరిగించి చిక్కబడ్డాక దింపేయాలి. తెలంగాణ రుచులు 160