ఈ పుటను అచ్చుదిద్దలేదు
పాలకూర తరుగు ఉల్లిపాయ పసుపు పాలకూర ఇగురు కావలసిన వస్తువులు 2 కప్పులు 1 1/4 టీస్పూన్ 1 టీస్పూన్ తయారుచేసే విధానం కారంపొడి అల్లంవెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్ గరంమసాలా పొడి 1/4 టీస్పూన్ తగినంత తగినంత ఉప్పు నూనె పాలకూర కడిగి సన్నగా తరగాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద, కారంపొడి వేసి కొద్దిగా వేయించి పాలకూర, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి నిదానంగా ఉడికించాలి. పాలకూర మగ్గిపోయి పూర్తిగా ఉడికి దగ్గర పడ్డాక గరంమసాలా పొడి వేసి దింపేయాలి. ఇదేవిధంగా చుక్కకూర, కోయగూర, తోటకూర, బచ్చలికూర మొదలైన ఆకుకూరలతో చేసుకోవచ్చు. ఇష్టముంటే పోపులో వెల్లుల్లి నలక్కొట్టి వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆకుకూరలు మంచివని అందరికీ తెలిసిందే కదా. 159 తెలంగాణ రుచులు