చామగడ్డలు టమాటాలు ఉల్లిపాయ కరివేపాకు పసుపు చామగడ్డ టమాట పులుసు కావలసిన వస్తువులు 250గ్రా.లు 2-3 1 2 రెబ్బలు 1/4 టీస్పూన్ కారంపొడి 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లిముద్ద 1 టీస్పూన్ చింతపండు పులుసు 1/4 కప్పు ధనియాలపొడి 1టీస్పూన్ గరంమసాలా పొడి 1/4 టీస్పూన్ ఉప్పు నూనె తగినంత 3 టీస్పూన్లు తయారుచేసే విధానం చామగడ్డలు పొట్టు తీసి గుండ్రంగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం, వెల్లుల్లిముద్ద వేసి కొద్దిగా వేగాక చామగడ్డ ముక్కలు, కారంపొడి, ధనియాలపొడి తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ముక్కలు కాస్త వేగాక సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత అరకప్పు నీళ్ళు పోసి ఉడికించాలి. ముక్కలు ఉడికిన తర్వాత చింతపండు పులుసు, గరంమసాలా పొడి వేసి మరికొద్దిసేపు ఉడికించాలి. పులుసు చిక్కబడిన తర్వాత దింపేయాలి. చిలగడదుంప లేదా మొరంగడ్డతో కూడా ఇలా పులుసు చేసుకోవచ్చు. 157 తెలంగాణ రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/178
స్వరూపం