Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చిక్కుడుకాయలు టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు పసుపు చిక్కుడుకాయ టమాట కూర కావలసిన వస్తువులు 250గ్రా.లు 2 1 2 2 రెబ్బలు 1/4 టీస్పూన్ 1టీస్పూన్ కారంపొడి అల్లంవెల్లుల్లి ముద్ద 1 టీస్పూన్ ధనియాలపొడి 1 టీస్పూన్ గరంమసాలాపొడి 1/4 టీస్పూన్ ఉప్పు నూనె తగినంత 3 స్పూన్లు తయారుచేసే విధానం గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో పసుపు, కారంపొడి, అల్లంవెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి. ముక్కలు మగ్గిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ధనియాలపొడి వేసి కలిపి మూత పెట్టి ఉ డికించాలి. అవసరమైతే అరకప్పు నీళ్ళు వేసి ఉడికించి దగ్గర పడ్డాక గరంమసాలా పొడి వేసి దింపేయాలి. 153 తెలంగాణ రుచులు