Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలంగాణ రుచులు అరటికాయలు 2 ఉల్లిపాయలు 2 అరటికాయ పచ్చిమసాలా వేపుడు కావలసిన వస్తువులు ఉప్పు కరివేపాకు తగినంత 2 రెబ్బలు పచ్చిమిర్చి 3-4 కొత్తిమీర కొద్దిగా పసుపు 1/4 టీస్పూన్ నూనె 4 టీస్పూన్లు ధనియాల పొడి 2 టీస్పూన్ ఆవాలు, జీలకర్ర 1/2 టీస్పూన్ మిరియాలపొడి 1 టీస్పూన్ తయారుచేసే విధానం అరటికాయలు చిన్న ముక్కలుగా తరిగి మజ్జిగ నీళ్ళలో వేసి ఉంచుకోవాలి. మందంగా ఉండే కడాయి లేదా గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిలపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు వేపాలి. ఇందులో పసుపు, అరటికాయ ముక్కలు, కరివేపాకు వేసి కలిపి మూత పెట్టి తర్వాత ధనియాలపొడి, మిరియాలపొడి తగినంత ఉ ప్పు వేసి కలుపుతూ వేయించి కొత్తిమీర చల్లి దింపేయాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కలిపి ముద్దగా నూరి కూడా వాడుకోవచ్చు. అరటికాయలు సెనగపిండి ఉప్పు వంటసోడా. అరటికాయ బజ్జీలు కావలసిన వస్తువులు 2-3 కారంపొడి 1 టీస్పూన్ 2 కప్పులు తగినంత వాము 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లిముద్ద 1 టీస్పూన్ 1/2 టీస్పూన్ నూనె వేయించడానికి 2 టీ స్పూన్లు ధనియాల పొడి తయారుచేసే విధానం అరటికాయ చెక్కు తీసి పల్చగా, కాస్త వెడల్పుగా, పొడవుగా ముక్కలు తరిగి నీళ్ళలో వేసి ఉంచాలి. ఒక గిన్నెలో సెనగపిండి, ధనియాలపొడి, కారంపొడి, వాము, తగినంత ఉప్పు, వంటసోడా, అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి కలిపి తగినన్ని నీళ్ళతో బజ్జీలపిండిలా మరీ పలుచగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా కలుపుకోవాలి. కడాయిలో నూనె వేడి చేయాలి. ఒక్కో అరటికాయ ముక్కను పిండిలో ముంచి వేడి నూనెలో వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. 150