Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నేతిబీరకాయ నేతిబీరకాయ ముద్దకూర కావలసిన వస్తువులు నేతిబీరకాయలు ఉల్లిపాయ పసుపు కారంపొడి కరివేపాకు తయారుచేసే విధానం 250గ్రా.లు అల్లం వెల్లుల్లి ముద్ద 1/2 టీస్పూన్ 1 ధనియాలపొడి 1 టీస్పూన్ 1/4 టీస్పూన్ కొబ్బరిపొడి 3 టీస్పూన్ 1 టీస్పూన్ ఉప్పు తగినంత 2 రెబ్బలు నూనె 3 టీస్పూన్ నేతిబీరకాయ తొక్కుతీసి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేవరకు వేయించి పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారంపొడి వేసి కొద్దిగా వేపి బీరకాయ ముక్కలు, తగినంత ఉ ప్పు వేసి కలిపి మూతపెట్టాలి. ముక్కలు మెత్తబడిన తర్వాత ధనియాలపొడి, కొబ్బరిపొడి వేసి కలిపి అరకప్పు నీళ్లు పోసి ఉ డికించాలి. ముక్కలు ఉడికి కూర దగ్గరపడ్డాక దింపేయాలి. నేతిబీరకాయ, పెసరపప్పు కూర కావలసిన వస్తువులు నేతిబీరకాయ 250గ్రా.లు పెసరపప్పు 50 గ్రా.లు ఉల్లిపాయ 1 కరివేపాకు 2 రెబ్బలు పసుపు 1/4 టీస్పూన్ కారంపొడి 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీస్పూన్ - ఉప్పు తగినంత నూనె 3 టీస్పూన్ తయారుచేసే విధానం నేతిబీరకాయ పొట్టు తీసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. పెసరపప్పు నీళ్లు పోసి నానబెట్టాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం పొడి వేసి కొద్దిగా వేపి పెసరపప్పు వేసి కలిపి మూతపెట్టాలి. పప్పు కాస్త వేగాక బీరకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టి నిదానంగా ఉడికించాలి. ఇందులో పెసరపప్పు బదులు బద్ద పెసర్లు వాడితే మరింత రుచిగా ఉంటుంది. తెలంగాణ 148 రుచులు