దొండకాయ టమాట కూర కావలసిన వస్తువులు దొండకాయలు ఉల్లిపాయ టమాటాలు పసుపు కారంపొడి కరివేపాకు తయారుచేసే విధానం 250గ్రా.లు 1 2 అల్లంవెల్లుల్లి ముద్ద 1 టీస్పూన్ ధనియాల పొడి 1 టీస్పూన్ గరంమసాలా పొడి - 1/4 టీస్పూన్ - 1/4 టీస్పూన్ 1 టీస్పూన్ ఉప్పు తగినంత నూనె 2 రెబ్బలు 3 టీస్పూన్లు దొండకాయలు కొంచెం పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, కరివేపాకు వేసి మెత్తబడేవరకు వేయించి పసుపు, కారంపొడి, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేయించి దొండకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ముక్కలు కాస్త మెత్తబడ్డాక సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ధనియాల పొడి వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. అవసరమైతే అరకప్పు నీళ్ళు వేసి ఉడికించి దగ్గర పడ్డాక గరంమసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. దొండకాయ కొబ్బరి కూర కావలసిన వస్తువులు దొండకాయలు 250గ్రా.లు ఉల్లిపాయ 1 ధనియాలపొడి కరివేపాకు 1 టీస్పూన్ పచ్చిమిర్చి 2 ఉప్పు పసుపు 1/4 టీస్పూన్ నూనె 2 రెబ్బలు తగినంత 3 టీస్పూన్లు కారంపొడి 1 టీస్పూన్ కొబ్బరిపొడి 4 టీస్పూన్లు అల్లంవెల్లుల్లిముద్ద 1 టీస్పూన్ తయారుచేసే విధానం దొండకాయలను ముక్కలుగా లేదా చక్రాలుగా తరిగి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేగిన తర్వాత దొండకాయ ముక్కలు, కారంపొడి, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి. ముక్కలు మగ్గిన తర్వాత ధనియాలపొడి, కొబ్బరిపొడి వేసి కలిపి కొద్దిగా నీళ్ళు చిలకరించి మూతపెట్టి చిన్న మంట మీద ఉడికించి దింపేయాలి. తెలంగాణ రుచులు 146
పుట:తెలంగాణ రుచులు.pdf/167
స్వరూపం