Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దొండకాయ వేపుడు - 2 కావలసిన వస్తువులు దొండకాయ పసుపు కారం పొడి కరివేపాకు తయారుచేసే విధానం 500 గ్రా.లు 1/4 టీస్పూన్ 11/2 టీస్పూన్ 2 రెబ్బలు ఉప్పు తగినంత నూనె 4 టీస్పూన్ ఆవాలు, జీలకర్ర 1/4 టీస్పూన్ దొండకాయలు కడిగి తుడిచి చాలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి. మందంగా ఉండే కడాయి లేదా వెడల్పుగా ఉండే గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు, దొండకాయ ముక్కలు వేసి కలిపి మూతపెట్టి, చిన్న మంట మీద మగ్గనివ్వాలి. ముక్కలు మగ్గిన తర్వాత మూతతీసి పసుపు, కారంపొడి, ఉప్పు వేసి కలిపి దోరగా వేయించి దింపేయాలి. దొండకాయ వేపుడు - 3 కావలసిన వస్తువులు దొండకాయలు ఉల్లిపాయ కరివేపాకు 500గ్రా.లు సెనగపిండి 5 టీస్పూన్లు 1 గరంమసాలా పొడి - 1/4 టీస్పూన్ 2 రెబ్బలు - 1/4 టీస్పూన్ ఉప్పు నూనె తగినంత 4 టీస్పూన్లు ఆవాలు, జీలకర్ర 1/2 టీస్పూన్ పసుపు కారంపొడి ధనియాలపొడి తయారుచేసే విధానం 1 టీస్పూన్ 2 టీస్పూన్ దొండకాయలు కడిగి తుడిచి చిన్న ముక్కలుగా తరగాలి. వెడల్పాటి, మందంగా ఉన్న కడాయి లేదా గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ఇందులో దొండకాయ ముక్కలు, పసుపువేసి కలిపి మూత పెట్టాలి. ముక్కలు కాస్త మగ్గిన తర్వాత కారంపొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి దోరగా వేయించాలి. ముక్కలు బాగా వేగిన తర్వాత సెనగపిండి గరంమసాలా పొడి వేసి కలిపి మరికొద్దిసేపు వేయించి దింపేయాలి. తెలంగాణ 145 రుచులు