ఈ పుటను అచ్చుదిద్దలేదు
పొట్లకాయ పెరుగు పచ్చడి కావలసిన వస్తువులు పొట్లకాయ తురుము పెరుగు 1 కప్పు 1 కప్పు నెయ్యి 2 టీస్పూన్ ఆవాలు, జీలకర్ర 1/4 టీస్పూన్ ఎండుమిర్చి 3 మినప్పప్పు ఉప్పు కొత్తిమీర కరివేపాకు నూనె 1 టీస్పూన్ తగినంత 1 టీస్పూన్ 1 రెబ్బ 1 టీస్పూన్ తయారుచేసే విధానం పొట్లకాయ సన్నగా తరిగి లేదా తురిమి పెట్టుకోవాలి. గిన్నెలో చెంచాడు నూనె వేడి చేసి పొట్లకాయ తురుము లేదా ముక్కలు వేసి దోరగా వేయించి పెట్టుకోవాలి చిన్న గిన్నెలో నెయ్యి వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక ఎండుమిర్చి, మినపప్పు, కరివేపాకు వేసి కొద్దిగా వేయించి పొట్లకాయ తురుము వేసి దింపేయాలి. పెరుగులో తగినంత ఉప్పు వేసి చిలికి పోపులో వేసి కలపాలి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తే మరింత రుచిగా ఉంటుంది. 143 తెలంగాణ రుచులు