దోసకాయ కొబ్బరి కూర కావలసిన వస్తువులు కారంపొడి దోసకాయ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పసుపు తయారుచేసే విధానం 250గ్రా.లు 2 2 రెబ్బలు కొద్దిగా 1/4 టీస్పూన్ 1 టీస్పూన్ 1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కొబ్బరిపొడి 3 టీబుల్ స్పూన్ గరం మసాలా పొడి - 1/4 టీస్పూన్ ఉప్పు నూనె తగినంత 3 టీస్పూన్ దోసకాయ పొట్టు తీసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం పొడి వేసి కొద్దిగా వేగిన తర్వాత దోసకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి. ముక్కలు కాస్త మెత్తబడి వేగిన తర్వాత అరకప్పు నీళ్లు పోసి ఉడికించాలి. ముక్కలు ఉడికిన తర్వాత కొబ్బరిపొడి వేసి కలిపి మరి కొద్దిసేపు ఉడికించి గరంమసాలా పొడి వేసి దింపేయాలి. దోసకాయ మసాలా కూర కావలసిన వస్తువులు దోసకాయ 250గ్రా.లు టమాటాలు 2 ఉల్లిపాయ 1 2 2 రెబ్బలు 1/4 టీస్పూన్ పచ్చిమిర్చి కరివేపాకు పసుపు తయారుచేసే విధానం కారంపొడి 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద 1/2 టీస్పూన్ ధనియాలపొడి 1 టీస్పూన్ నువ్వులు 3 టీస్పూన్ ఉప్పు తగినంత నూనె 3 టీస్పూన్ నువ్వులు దోరగా వేయించి పొడి చేసుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కారంపొడి, అల్లం వెల్లుల్లి ముద్ద కారంపొడి వేసి కొద్దిగా వేగిన తర్వాత దోసకాయ ముక్కలు తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి. ముక్కలు కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగిన టమాటాలు, ధనియాలపొడి వేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. అవసరమైతే అరకప్పు నీళ్లు పోసి ఉడికించాలి. దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు ఉడికి దగ్గరపడ్డాక నువ్వుపొడి వేసి కలిపి మరికొద్దిసేపు ఉడికించి, నూనె తేలుతున్నప్పుడు దింపేయాలి. 141 తెలంగాణ రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/162
స్వరూపం