Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దోసకాయ/ బుడమకాయ దోసకాయ కూర కావలసిన వస్తువులు దోసకాయ 250గ్రా.లు ఉల్లిపాయ 1 పచ్చిమిర్చి కరివేపాకు 2 2 రెబ్బలు - 1/4 టీస్పూన్ కారంపొడి 1 టీస్పూన్ ధనియాలపొడి 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద 1/2 టీస్పూన్ ఉప్పు తగినంత నూనె 3 టీస్పూన్ పసుపు తయారుచేసే విధానం దోసకాయలు పైన పొట్టు తీసి, చేదు చూసుకొని గింజలు తీసేసి చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసుకొని సన్నగా తరిగిన ఉల్లి పాయ ముక్కలు నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం పొడి వేసి కొద్దిగా వేగాక దోసకాయ ముక్కలు తగినంత ఉప్పు ధనియాలపొడి వేసి కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అరకప్పు నీళ్లు పోసి ఉడికించాలి. ముక్కలన్నీ ఉడికి దగ్గర పడ్డాక దింపేయాలి. దోసకాయ, టమాటా కూర కావలసిన వస్తువులు దోసకాయలు టమాటాలు 250గ్రా.లు 2 ఉల్లిపాయ పసుపు 1 ధనియాలపొడి ఉప్పు కరివేపాకు 1 టీస్పూన్ తగినంత 2 రెబ్బలు 1/4 టీస్పూన్ కొత్తిమీర కొద్దిగా కారంపొడి 1 టీస్పూన్ నూనె 3 టీస్పూన్ - అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీస్పూన్ తయారుచేసే విధానం దోసకాయ పొట్టు తీసి చేదు చూసుకొని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి కాస్త వేపి దోసకాయ ముక్కలు, కారంపొడి, తగినంత ఉప్పు, ధనియాలపొడి వేసి కలిపి మూతపెట్టాలి. ముక్కలు మగ్గిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. కూరంతా ఉడికి చిక్కబడ్డాక నింపేయాలి. ఇష్టముంటే పోపులో మెంతికూర కూడా వేసుకోవచ్చు. తెలంగాణ 140 రుచులు