గుమ్మడికాయ పులుసు గుమ్మడికాయ ముక్కలు కావలసిన వస్తువులు 250గ్రా.లు ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు కారంపొడి అల్లం - వెల్లుల్లి ముద్ద కరివేపాకు జీలకర్రపొడి మెంతిపొడి చింతపండు పులుసు నువ్వుపొడి బెల్లం 1 2 1/4 టీస్పూన్ - 1 టీస్పూన్ - 1/2 టీస్పూన్ - 2 రెబ్బలు - 1 టీస్పూన్ 1/4 టీస్పూన్ 1/4 కప్పు 3 టీస్పూన్ చిన్నముక్క తయారుచేసే విధానం ఉప్పు నూనె తగినంత 3 టీస్పూన్ గుమ్మడికాయ పొట్టు తీసి ముక్కలుగా తరిగి కాస్త పసుపు, నీళ్లు పోసి కొద్దిగా ఉడికించి వార్చుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, కారంపొడి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేపాలి. తర్వాత గుమ్మడికాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి. చింతపండు పులుసులో జీలకర్రపొడి, మెంతిపొడి, నువ్వులపొడి, బెల్లం వేసి కలిపి ముక్కలు వేసి కప్పు నీళ్లు పోసి కలిపి మరికొద్దిసేపు ఉడికించాలి. ఈ పులుసు కాస్త పలచగానే ఉండాలి. 139 తెలంగాణ రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/160
స్వరూపం