బోడకాకరకాయలు బోడకాకరకాయ పులుసు కావలసిన వస్తువులు 250గ్రా.లు ఉల్లిపాయలు 2 పసుపు 1/4 టీస్పూన్ కారంపొడి 1 టీస్పూన్ ధనియాలపొడి 1 టీస్పూన్ జీలకర్రపొడి 1 టీస్పూన్ మెంతిపొడి 1/4 టీస్పూన్ నువ్వుపొడి చింతపండుపులుసు అల్లంవెల్లుల్లి ముద్ద 3 టీస్పూన్ 1/4 కప్పు 1 టీస్పూన్ తగినంత 3 తయారుచేసే విధానం ఉప్పు కరివేపాకు నూనె జీలకర్ర, మెంతులు 2 రెబ్బలు 4 టీస్పూన్ 1/4 టీస్పూన్ బోడకాకరకాయలు పైన కొంచెం గీకేసి రెండు లేదా నాలుగు ముక్కలు చేసుకోవాలి. ఈ ముక్కల్లో కొంచెం పసుపు, నీళు వేసి ఉడికించి వార్చుకోవాలి. గిన్నెలో రెండు చెంచాల నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు దోరగా వేయించుకుని పసుపు, కారంపొడి, ధనియాలపొడి, జీలకర్రపొడి, మెంతిపొడి, చింతపండు పులుసు, నువ్వుపొడి, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇంతకు ముందు ఉల్లిపాయలు వేయించుకున్న గిన్నెలో మిగిలిన నూనె వేడి చేసి జీలకర్ర, మెంతులు వేసి కాస్త వేగాక కాకరకాయ ముక్కలు, కరివేపాకు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. ముక్కలు మెత్తబడ్డాక రుబ్బిన మసాలా, కప్పుడు నీళ్లు తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. ముక్కలు, మసాలా కలిసి ఉడికిన నూనె తేలుతున్నప్పుడు దింపేయాలి. 137 తెలంగాణ రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/158
స్వరూపం