Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బెండకాయ టమాటా కూర కావలసిన వస్తువులు బెండకాయలు 250గ్రా.లు అల్లం, వెల్లుల్లి ముద్ద 1 టీస్పూన్ టమాటాలు 3 ధనియాలపొడి 1 టీస్పూన్ ఉల్లిపాయ 1 గరం మసాలా పొడి 1/4 టీస్పూన్ కరివేపాకు 2 రెబ్బలు ఉప్పు తగినంత 1/4 టీస్పూన్ 4 టీస్పూన్ నూనె 3 టీస్పూన్ పసుపు కారంపొడి తయారుచేసే విధానం బెండకాయలను అంగుళం ముక్కలుగా తరగాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇందులో కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేసి బెండకాయ ముక్కలు వేయాలి. కొద్దిగా వేగిన తర్వాత కారంపొడి, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ధనియాలపొడి, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టి నిదానంగా ఉడికించాలి. ముక్కలన్నీ ఉడికిన తర్వాత గరం మసాలా పొడి వేసి దింపేయాలి. బెండకాయ పులుసు కావలసిన వస్తువులు బెండకాయలు టమాటా 250గ్రా.లు 1 అల్లం వెల్లుల్లి ముద్ద ధనియాలపొడి 1/2 టీస్పూన్ 1 టీస్పూన్ ఉల్లిపాయ చింతపండు 1 నిమ్మకాయంత మెంతిపొడి పచ్చిమిర్చి కరివేపాకు 2 ఆవాలు, జీలకర్ర 2 రెబ్బలు ఉప్పు చిన్న ముక్క చిటికెడు 1/4 టీస్పూన్ తగినంత 1/4 టీస్పూన్ 1 టీస్పూన్ నూనె 3 టీస్పూన్ కొత్తిమీర కొద్దిగా పసుపు కారంపొడి తయారుచేసే విధానం బెండకాయలను అంగుళం ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. చింతపండుని నీళ్ళు పోసి నానబెట్టాలి. గిన్నెలు నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మెత్త బడేవరకు వేపాలి. ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు కారం పొడి వేసి కలిపి బెండకాయ ముక్కలు వేసి కలుపుతూ వేయించాలి. ముక్కలు కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ధనియాలపొడి తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టి ఉ డికించాలి ఉడికిన తర్వాత చింతపండు పిసికి పులుసు తీసి వేయాలి. ఇందులో బెల్లం, కొత్తిమీర వేసి పులుపు వాసన పోయేవరకు ఉడికించి నింపేయాలి. మనకు నచ్చినట్టుగా చిక్కగా లేదా పలుచగా చేసుకోవచ్చు. తెలంగాణ 133 రుచులు