Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బెండకాయ బెండకాయ వేపుడు కావలసిన వస్తువులు బెండకాయలు పసుపు కారంపొడి ధనియాలపొడి తయారుచేసే విధానం తగినంత 2 రెబ్బలు 500 గ్రా. లు ఉప్పు 125గ్రా. లు 1 టీస్పూన్ కరివేపాకు ఆవాలు, జీలకర్ర 1/4 టీస్పూన్ 2 టీస్పూన్ నూనె 4 టీస్పూన్ బెండకాయలు తుడిచి సన్నగా చక్రాలుగా తరగాలి. మందంగా, వెడల్పుగా ఉండే గిన్నె లేదా కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక బెండకాయలు, కరివేపాకు వేసి మూతపెట్టకుండా నిదానంగా వేయించాలి. ముక్కలన్నీ కరకరలాడేలా అయ్యేవరకు వేయించాలి. ముక్కలు వేగి, ఉడకగానే ఉప్పు, కారాలు వేసి కొద్దిగా వేపి దింపేయాలి. బెండకాయలు 500 గ్రా.లు ఉల్లిపాయ 1 పచ్చిమిర్చి కరివేపాకు 2 2 రెబ్బలు 1/4 టీస్పూన్ బెండకాయ ముద్దకూర కావలసిన వస్తువులు కారంపొడి 1 టీస్పూన్ ధనియాలపొడి 2 టీస్పూన్ ఉప్పు తగినంత నూనె 4 టీస్పూన్ కొత్తిమీర కొద్దిగా పసుపు తయారుచేసే విధానం బెండకాయలు కడిగి తుడిచి అరంగుళం ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లి పాయ ముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఇందులో పసుపు కరివేపాకు, బెండకాయ ముక్కలు వేసి కలపాలి. చిన్న మంటమీద వేయిస్తూ ముక్కలు కాస్త మెత్తబడ్డ తర్వాత తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి. కూర మెత్తం ఉడికిన తర్వాత ధనియాలపొడి, కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి. తెలంగాణ 132 రుచులు