Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆనపకాయ ముట్టీలు కావలసిన వస్తువులు ఆనపకాయ తురుము . 2 కప్పులు కారంపొడి సెనగపిండి 1/2 కప్పు పసుపు పచ్చిమిర్చి 3 ఉప్పు జీలకర్ర 1 టీస్పూన్ కొత్తిమీర ధనియాల పొడి 1 టీస్పూన్ నూనె 1 టీస్పూన్ 1/4 టీస్పూన్ తగినంత 2 టీస్పూన్లు వేయించడానికి తయారుచేసే విధానం లేత ఆనపకాయ చెక్కు తీసేసి గింజలు తీసి సన్నగా తురుముకోవాలి. తురుము గట్టిగా పిండి నీరంతా ఓడ్చేసి నీరంతా పోయాక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో పసుపు, కారంపొడి, ధనియాల పొడి, జీలకర్ర, సన్నగా తరిగిన నూరిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇందులో సెనగపిండి వేసి చిన్న ఉండలు చేసుకోవాలి. ఈ ఉండలను వెడల్పు లేదా కోలగా వత్తుకుని వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. ఇవి ఇలాగే తినవచ్చు లేదా కూరలాగా కూడా చేసుకోవచ్చు. 131 తెలంగాణ రుచులు