ఆనపకాయ ముక్కలు 3 కప్పులు ఉల్లిపాయ 1 టమాటాలు 3 కరివేపాకు 2 రెబ్బలు 1 చిన్నకట్ట ఆనపకాయ టమాట కూర కావలసిన వస్తువులు పసుపు కారంపొడి 1/4 టీస్పూన్ 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లి ముద్ద 1 టీస్పూన్ ఉప్పు తగినంత నూనె 3 టీస్పూన్లు మెంతికూర తయారుచేసే విధానం గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కడిగి సన్నగా తరిగిన మెంతికూర, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపి ఆనపకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు కలుపుకోవచ్చు. ముక్కలు ఉడికి కూర దగ్గర పడ్డాక దింపేయాలి. ఆనపకాయ మసాలా వేపుడు కావలసిన వస్తువులు ఆనపకాయముక్కలు ఉల్లిపాయ - 2 కప్పులు ధనియాలు 2 టీస్పూన్లు 1 నువ్వులు కరివేపాకు 2 రెబ్బలు ఉప్పు 3 టీస్పూన్లు తగినంత పసుపు 1/4 టీస్పూన్ నూనె 3 టీస్పూన్లు ఎండుమిర్చి జీలకర్ర 6 ఆవాలు, జీలకర్ర 1/2 టీస్పూన్ 1 టీస్పూన్ తయారుచేసే విధానం కడాయి వేడి చేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, నువ్వులు దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఆనపకాయ చిన్న ముక్కలుగా తరిగి ఉంచాలి. గిన్నె లేదా కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి మెత్తబడేవరకు వేపాలి. ఇందులో ఆనపకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి నిదానంగా ఉడికించాలి. ముక్కలు మెత్తబడ్డాక తయారు చేసుకున్న మసాలా పొడి వేసి వేయించాలి. కూర పొడిపొడిగా అయ్యాక దింపేయాలి. తెలంగాణ 130 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/151
స్వరూపం