ఆలుగడ్డ కుర్మా కావలసిన వస్తువులు ఆలుగడ్డలు టమాటాల ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు - 250గ్రా.లు 100 గ్రా.లు 1 2 1/4 టీస్పూన్ పెరుగు ఉప్పు కొబ్బరిపొడి గసగసాలు 3 టీస్పూన్లు 2 టీస్పూన్లు 1/2 కప్పు తగినంత నూనె 3 టీస్పూన్లు కొత్తిమీర కొద్దిగా పుదీనా ఆకులు 10 కారంపొడి ధనియాల పొడి గరంమసాలా పొడి తయారుచేసే విధానం 1 టీస్పూన్ 1 టీస్పూన్ 1/2 టీస్పూన్ కడాయిలో గసగసాలు వేయించి కొబ్బరిలో కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి. కడాయి లేదా గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు రంగు మారుతున్నప్పుడు పుదీనా ఆకులు, పసుపు, కారంపొడి, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసి కలుపుతూ కొద్దిసేపు వేయించాలి. ఇందులో తరిగిన టమాటా ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి. పెరుగులో కొబ్బరి, గసగసాల పొడి, ధనియాల పొడి, గరంమసాలా పొడి వేసి బాగా కలిపిన మగ్గిన ఆలుగడ్డ కూరలో వేసి అరకప్పు నీళ్ళు కూడా వేసి కలిపి మూతపెట్టి నిదానంగా ఉడికించాలి. కూర మొత్తం ఉడికి నూనె తేలుతున్నప్పుడు కొత్తిమీర వేసి దింపేయాలి. ఆలుగడ్డ మసాలా వేపుడు కావలసిన వస్తువులు ఆలుగడ్డలు ఎండుమిర్చి 250గ్రా.లు గసగసాలు 1 టీస్పూన్ 4 వెల్లుల్లి మిరియాలు 5 పసుపు 4-5 రెబ్బలు 1/4 టీస్పూన్ T 1 టీస్పూన్ కరివేపాకు 2 రెబ్బలు 1 టీస్పూన్ ఉప్పు తగినంత 3 టీస్పూన్లు నూనె 4 టీస్పూన్లు ధనియాలు కొబ్బరిపొడి తయారుచేసే విధానం వేయించుకుని కొబ్బరిపొడి, మిరియాలు వేసి బరకగా పొడి చేసుకోవాలి. కడాయిలో మిగిలిన నూనె వేసి వేడి చేసి పొట్టు తీసి నిలువుగా తరిగిన ఆలుగడ్డ ముక్కలు, పసుపు వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. ఇందులో ముందు తయారుచేసుకున్న మసాలా పొడి, నలక్కొట్టిన వెల్లుల్లి, కరివేపాకు తగినంత ఉప్పు వేసి మరికొద్దిసేపు కరకరలాడేలా వేయించుకోవాలి. ఇష్టముంటే పైనుండి కొంచెం నిమ్మరసం, కొత్తిమీర వేసుకోవచ్చు. తెలంగాణ 121 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/142
స్వరూపం